OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో ఓటిటిలలో దుమ్ము రేపుతున్నాయి. రీసెంట్గా అన్ని భాషలలో వచ్చిన ఇటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పకపోయే మూవీలో తమిళ్ యాక్టర్ సముద్రఖని పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. ఈ స్టోరీ ఒక క్రిమినల్ ని పట్టుకునే క్రమంలో నడుస్తుంది. చివరి వరకు సస్పెన్షన్ తో సాగిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సముద్రఖని, ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘నాన్ కడవుల్ ఇల్లై’ (Naan Kadavul Illai). 2023లో వచ్చిన ఈ సినిమాకి S.A.చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో సముద్రఖని, సరవణన్, సాక్షి అగర్వాల్, ఇనియా, డయానా శ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ ఒక పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను నేరాలను అరికట్టి, నేరస్థులను పట్టుకునే ఒక డైనమిక్ పోలీస్ గా ఉంటాడు. ఒక క్రిమినల్ వల్ల ఈ ఫ్యామిలీ అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సెంథూర పాండి ఒక నిజాయితీ కలిగిన ఒక పోలీసు అధికారి గా ఉంటాడు. అతను చట్టాన్ని ఎక్కువగా గౌరవిస్తూ, ఒక డైనమిక్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకుంటాడు. అతని భార్య మహేశ్వరి, కుమార్తె ఉమా తో అతను సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఇతనికి వీళ్ళు తప్ప మరోప్రపంచం ఉండదు. ఒకసారి చిన్న అమ్మాయి అయిన ఉమా దేవునికి ఒక లేఖ రాసి తన కుటుంబాన్ని రక్షించమని కోరుతుంది. ఈ లేఖ యాదృచ్ఛికంగా ఒక వ్యాపారవేత్త అయిన జోతిలింగంకి చేరుతుంది. అతను ఉమాకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన కుటుంభం ఒక క్రిమినల్ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఒక భయంకరమైన క్రిమినల్‌ను పాండి అరెస్టు చేస్తాడు. కానీ ఆ క్రిమినల్ ఊహించని విధంగా జైలు నుండి తప్పించుకుంటాడు.
ఈ సంఘటన సెంథూర పాండి జీవితంలో, అనుకోని సంఘటనలకు దారితీస్తుంది. ఇది అతని కుటుంబం, ఉద్యోగం పై కూడా ప్రభావం చూపుతుంది. ఆ నేరస్థున్ని పట్టుకోవడానికి అతను చేసే ప్రయత్నాలలో అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు సెంథూర పాండి. ఈ క్రమంలో ఆ క్రిమినల్ సెంథూర పాండి కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. తనని చంపుతానని బెదిరిస్తాడు. ఈ స్టోరీ ఇప్పుడు ఒక రివేంజ్ డ్రామాగా మారుతుంది. చివరికి సెంథూర పాండి తన కూతుర్ని కాపాడుకుంటాడా ? ఆ క్రిమినల్ ని పట్టుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ను మిస్ కాకుండా చూడండి.
Read Also : వామ్మో ఈ నీళ్లు తాగితే జాంబీలు అయిపోతారు బాబోయ్ … జాంబిరెడ్డి లాంటి క్రేజీ హారర్ థ్రిల్లర్