BigTV English

SSMB29 : మహేష్ బాబును 3000 మందితో ఆ సీక్వెన్సెస్ రిహాసల్స్ చేయించునున్న జక్కన్న

SSMB29 : మహేష్ బాబును 3000 మందితో ఆ సీక్వెన్సెస్ రిహాసల్స్ చేయించునున్న జక్కన్న

SSMB29 : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. వాస్తవానికి ఈ సినిమాకి ముందు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ కి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ అలానే మహేష్ కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ వలన ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా జరిగిన ప్రతిసారి ఒక విషయం రిపీట్ అవుతుంది. ఆ సినిమాకి థియేటర్స్ లో సరైన ఆదరణ లభించక పోయినా కూడా కొన్ని రోజుల తర్వాత టీవీలో వచ్చినప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. అరెరే ఇంత మంచి సినిమా థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదా అని అనిపిస్తుంది. అతడు ఖలేజా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక గుంటూరు కారం కొంత మేరకు కమర్షియల్ గా సక్సెస్ సాధించి పర్వాలేదు అనిపించింది.


ఒక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్నాడు మహేష్ బాబు. ఇప్పటివరకు రాజమౌళి చాలామంది హీరోలను స్టార్ హీరోస్ ని చేశాడు. కానీ ఇప్పటివరకు ఎస్.ఎస్ రాజమౌళి స్టార్ హీరోలతో పని చేయలేదు. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమాను చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్ కు వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళికి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అని మనకు తెలియనిది కాదు.

3000 మందితో రిహాసల్స్


ఇకపోతే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ సినిమాలో ఏకంగా 3,000 మందితో బోట్ సీక్వెన్సెస్ ను రిహాసల్స్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ రిహాసల్స్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఒక మహేష్ బాబు యాక్షన్ సీక్వెంచర్స్ ఎలా చేస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో డూప్ లేకుండా మహేష్ బాబు చేశారు. టక్కరి దొంగ సినిమా టైంలో డూప్ లేకుండా మహేష్ చేసిన విన్యాసాలను డైరెక్టర్ జయంత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలానే నేనొక్కడినే సినిమా టైంలో కూడా బోట్ సీక్వెన్సెస్ గురించి చాలామంది ప్రొఫెషనల్ స్విమ్మర్స్ దూకినట్లే మహేష్ కూడా డుప్ లేకుండా దూకారు అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక అంత డెడికేషన్ తో వర్క్ చేసిన మహేష్ ఇక రాజమౌళి దర్శకత్వంలో ఏ రేంజ్ లో చేయబోతున్నాడు అని అందరికీ క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

Also Read : Pradeep Chilukuri : కమర్షియల్ సినిమా తీసేది ఆడియన్స్ కోసం, తెలివైనవాళ్ల కోసం కాదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×