BigTV English

Lavanya – Raj Tarun : లావణ్య యూటర్న్… రాజ్ తరుణ్ పేరెంట్స్ నాకు అత్తమామలే అంటూ..

Lavanya – Raj Tarun : లావణ్య యూటర్న్… రాజ్ తరుణ్ పేరెంట్స్ నాకు అత్తమామలే అంటూ..

Lavanya – Raj Tarun : రాజ్ తరుణ్, లావణ్య గొడవ ముగిసింది అనుకున్న టైంలో వ్యవహారం మరోసారి తెర పైకి వచ్చింది. బుధవారం లావణ్య ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ పేరెంట్స్ ని గెంటేయడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. లావణ్య ఇంటి ముందు పోలీసులు మీడియా, చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసారు. హైదరాబాదులోని కోకాపేటలో లావణ్య నివాసం ఉంటున్న ఇంటి వద్దకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉందని ఆ ఆస్తి తీసుకొని లావణ్య వారిని బయటికి గెంటేసిందని ఆరోపిస్తున్నారు. వారు తమ కుమారుడు లావణ్య వల్లే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని తమ ఆస్తిని తిరిగి మళ్ళీ వారికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ గొడవతో మరోసారి రాజ్ తరుణ్, లావణ్య వివాదం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. లావణ్య చెప్తున్న దాని ప్రకారం.. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో కలిసి ఆమెపై దాడికి వచ్చారని, అసభ్యంగా ప్రవర్తించారని, తనని ఇంట్లో నుంచి బలవంతంగా గెంటేయాలని చూశారని ఆమె ఆరోపిస్తుంది. ఈ సంఘటనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని లావణ్య చెప్తోంది. లావణ్య తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి నా కూతురును రాజ్ తరుణ్ పేరెంట్స్ కొట్టారని దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి, రాజ్ తరుణ్ తల్లిదండ్రుల గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.


లావణ్య మాట్లాడుతూ..

రాజ్ తరుణ్ పేరెంట్స్ నాకు తల్లిదండ్రుల లాంటి వాళ్లే, ఎంత కాదనుకున్నా వాళ్ళు నా అత్తమామలు కొట్టుకున్నా , తిట్టుకున్నా మేమంతా ఒక ఫ్యామిలీ. రాజ్ తరుణ్ కి నేను నా ఫ్యామిలీ ఎన్నో రకాలుగా సహాయం చేసాము. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికీ లేదు. ఈ ఇంట్లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎలా అయితే హక్కు ఉందని వచ్చారో, నేను అలానే హక్కు ఉందని భావిస్తున్నా, నిన్న అంత గొడవ జరిగిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్లి మాట్లాడితే.. ఐదు నిమిషాల్లో వాళ్లు నా మాటలకు అంగీకరించి ఈ ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. అలానే ఏదో ఒక రోజు రాజ్ తరుణ్ కూడా తిరిగి ఇక్కడికి వస్తాడని నేను భావిస్తున్నాను. ఇదంతా నా మంచి కోసమే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు మా ఇంటికి వచ్చివుంటున్నారో, నేను ఈ ఇంట్లో వుంటానికి నాకు హక్కు ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా.. వాళ్లు ఇలా రావడం, ఇదంతా జరగడం అంతా నా మంచికే అనుకుంటున్నాను. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నా నేను అక్కడికి వెళ్లి, నేను నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. మీ అమ్మానాన్న ఎలాగైతే ప్రాపర్టీ మాదే అని వచ్చారో, నేను కూడా నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, అలాంటప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు రాకూడదు. వాళ్ళు మా ఇంటికి రావద్దు అని నేనంటే వాళ్లకు హక్కు ఉంది అని ఈ ప్రపంచం ఎలాగైతే అంటుందో.. అలాగే నేను కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. నాకు హక్కు ఉంది అన్నది కూడా నిజమే కదా.. చట్టానికి మీడియాకి నేను థాంక్స్ చెప్తున్నాను మ. ఇక్కడకి ఎవరిని రావద్దు అని అనడానికి లేదు. రాజ్ తరుణ్ కూడా వస్తాడేమో ఇవన్నీ అందుకు సంకేతాలుగా నేను భావిస్తున్నాను అని లావణ్య తెలిపింది.


ఇంటి గురించి లావణ్య మాట్లాడుతూ ..

మా ఇల్లు కొనేటప్పుడు సినిమా పరంగా కొన్నారు. రెండు సంవత్సరాలు ఇంటి కావాల్సిన వస్తువులను, ఇంటికి కావాల్సిన సప్లై అన్నిటిని మా పేరెంట్స్ ఇచ్చారు. నెలకి 30,000 అయితే నెలనెలా రాజ్ తరుణ్ కి జీతం రాదు. ఆయన సినిమా చేసినప్పుడే డబ్బులు చేతిలో ఉంటాయి. అలాంటప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ చేశారు. రాజ్ వాడే ఫోన్ కూడా నేను ఇచ్చిందే. కరోనా టైంలో రెండు సంవత్సరాలు సినిమా లేకపోతే.. మా పేరెంట్స్ ఉన్న దాంట్లోనే వారు సద్దేవారు. కట్నం పరంగా నేను ఏమి తీసుకు రాకపోయినా అవసరమైనప్పుడల్లా వాళ్లే హెల్ప్ చేశారు. మా పేరెంట్స్ అకౌంట్స్ ని చెక్ చేస్తే ఆ విషయం మీకు తెలుస్తుంది. రాజ్ వాడే ఒక షర్టు దగ్గర నుండి రాజ్ ఎక్కడికి వెళ్లాలన్నా అంతా దగ్గరుండి చూసుకుంది నేను. అమ్మాయిల వెంటపడి రాజ్ తన కెరీర్ అని పోగొట్టుకున్నాడు. లావణ్య తప్పుడుదైతే ఇన్ని సంవత్సరాలు తెలియకుండా ఇప్పుడు ఎలా తెలిసింది. నాతో 11 సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత నేను చెడ్డదాన్ని బయటికి వచ్చాడు. నన్ను వదిలించుకోవాలన్నా ప్రాసెస్ లో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పటికే మస్తాన్ సాయి చేసిన దానికి అనుభవిస్తున్నాడు. అలానే రాజ్ తరుణ్ తప్పుంటే అది నిరూపణ అవుతుంది అని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ పై హైకోర్టు కైనా వెళ్తానని అతని బెయిల్ క్యాన్సిల్ చేయిస్తానని లావణ్య అంటుంది. ఇప్పుడు ఈ గొడవ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

 

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×