BigTV English

Unstoppable with NBK : మెగా మోజులో పడ్డాడు… ఆహా వాళ్లు రైటర్‌ను మార్చాల్సిందేనా..?

Unstoppable with NBK : మెగా మోజులో పడ్డాడు…  ఆహా వాళ్లు రైటర్‌ను మార్చాల్సిందేనా..?

Unstoppable with NBK : టాలీవుడ్ స్టార్ హీరోలు హోస్ట్‌లుగా మారి షోలు చేయడం ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లోకి నందమూరి నటసింహం బాలకృష్ణ చేరిపోయారని ఆహా వాళ్లు ప్రకటించడంతో… యాంకరింగ్ రంగంలో ఇదో సంచలనం అనుకున్నారు. బాలయ్య హోస్ట్ చేస్తే ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ ఫుల్ సక్సెస్ అయింది. తర్వాత రెండు సీజన్స్ కూడా పర్లేదు. అయితే నాలుగో సీజన్‌కి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. చే జారిపోయింది. దీనికి కారణం రైటర్, డైరెక్టరే అని బాలయ్య ఫ్యాన్స్ ను విమర్శలు వస్తున్నాయి.


ఆహా నుంచి వస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్‌కు మంచి పాపులారిటీ, రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య హోస్ట్ అవ్వడంతో అభిమానులు తమ భుజాలపై పెట్టుకుని మరి హిట్ చేశారు ఆ సీజన్‌ను.

ఇక రెండో సీజన్‌కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే వచ్చింది. కారణం.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, చంద్రబాబు గెస్ట్‌లు రావడం అనే చెప్పాలి. ఇక మూడో సీజన్‌లో కేవలం 3 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. అందులో యానిమల్ మూవీ టీం వచ్చిన రెండో ఎపిసోడ్ మాత్రమే వర్క్ అవుట్ అయింది. మిగితా రెండు ఎపిసోడ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.


Also Read : అల్లు అర్జున్ మరోసారి… గెస్ట్ లిస్ట్ చూశారా… మైండ్ పోయేలా ఉంది సామి..

నాలుగో సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబు గెస్ట్. ఓపెనింగ్ అదిరిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఫుల్ ఎపిసోడ్‌లో రెండు – మూడు ప్రశ్నలు మాత్రమే ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మిగితా ఎపిసోడ్ మొత్తం కూడా డల్‌గానే ఉందనే కామెంట్స్ వచ్చాయి. అయితేే దీని అంతటికీ కారణం… రైటర్‌తో పాటు డైరెక్షన్ టీం అని బాలయ్య అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఆహా వాళ్లు వెంటనే ఆ టీంని తొలగిస్తే… వచ్చే కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.

ఈ అన్‌స్టాపబుల్ టీంలో ఓ రైటర్… మెగా ఫ్యామిలీలో ఓ హీరోతో సినిమా చేయాలని, మెగా కంపౌండ్ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. దీనివల్లే అన్ స్టాపబుల్ నిర్లక్ష్యానికి గురి అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే… సీజన్ సీజన్‌కి ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గుతుందని, అందువల్ల బాలయ్య పైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read : అన్ స్టాపబుల్ ఈ సారి ప్లాప్ ?… ఏ మాత్రం లేని ఆదరణ..

అంతే కాదు, దసరా సందర్భంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి వచ్చినంత క్రేజ్ కూడా షోకు రావడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అన్ స్టాపబుల్ కు సంబంధించి ప్రతి సీజన్‌కు ట్రైలర్ కట్‌ను యంగ్ డైరెక్టర్, హనుమాన్‌తో సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ చేసే వాడు. కానీ, ఈ సారి ప్రశాంత్ వర్మ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడనే కారణంతో ఆయనను తప్పించారు అని టాక్. అది కూడా ఈ సీజన్‌పై ఎఫెక్ట్ పడిందని చెప్పుకుంటున్నారు.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×