BigTV English

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ ఈ సారి ప్లాప్ ?… ఏ మాత్రం లేని ఆదరణ..

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ ఈ సారి ప్లాప్ ?… ఏ మాత్రం లేని ఆదరణ..

Unstoppable with NBK : నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా కూడా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ (Unstoppable with NBK Season 4)కి బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోగా, తాజాగా నాలుగవ సీజన్ మొదలైంది. కానీ ఈసారి బాలయ్య షోకి అనుకున్నంతగా రెస్పాన్స్ రాకపోవడం నందమూరి అభిమానులకు షాక్ ఇస్తుంది.


ఇప్పటికే సీజన్ 4లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెస్ట్ గా హాజరు కావడంతో కాస్త హడావిడి కనిపించింది. కానీ ఆ ఎపిసోడ్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ విన్పించాయి. ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ లో ‘లక్కీ భాస్కర్’ అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా దుల్కర్ సల్మాన్ ‘అన్ స్టాపబుల్ 4’ (Unstoppable with NBK Season 4) షోకి హాజరయ్యి బాలయ్యతో సందడి చేశారు. కానీ దీనికి ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు. అలాగే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య హాజరై తను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కంగువా’ను ప్రమోట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. కానీ దీనిపై కూడా ప్రేక్షకులు ఆసక్తిని వ్యక్తం చేయట్లేదు.

మొత్తానికి ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ (Unstoppable with NBK Season 4) కి అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం లేదు అనేది ప్రేక్షకుల ఒపీనియన్. ఈ సీజన్ అంతా ప్లాప్ రెస్పాన్స్ దక్కించుకుంది అని టాక్ నడుస్తోంది. నిజానికి ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్లలో కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ మాత్రమే కాస్త బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్లకు పెద్దగా క్రేజ్ దక్కట్లేదు. కనీసం టీజర్ లాంచ్ ఎపిసోడ్ కి వచ్చినంత క్రేజ్ కూడా ఇప్పుడు వస్తున్న ఎపిసోడ్స్ కి రాకపోవడం గమనార్హం.


అయితే ఈ షోకి సీజన్ సీజన్ కి ఆదరణ తగ్గడానికి కారణం నిజానికి బాలయ్యే. బాలయ్య లాంటి స్టార్ హీరోని పెట్టి ఇలా సినిమా ప్రమోషన్లు ఎలా చేయిస్తారు అంటూ పెదవి విరుస్తున్నారు ఆయన అభిమానులు. కేవలం టాక్ షో అంటే పలువురు హీరోల పర్సనల్ విషయాలను గురించి ముచ్చటించడం అనేది ఆసక్తిని కలిగిస్తుంది గాని, బాలయ్య లాంటి ఒక స్టార్ హీరోని హోస్ట్ గా పెట్టి, ఆయన కంటే చిన్న హీరోలను గెస్ట్ గా పిలిచి, వాళ్ల సినిమాలను ఈ షో ద్వారా ప్రమోట్ చేయడం ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇక నాలుగవ సీజన్ అయితే మరీ దారుణంగా ఉంది అంటూ ఫైర్ అవుతున్నారు. అందుకే ఈ (Unstoppable with NBK Season 4) సీజన్లో వచ్చిన ఏ ఎపిసోడ్ పై కూడా పెద్దగా ప్రేక్షకులు ఆసక్తిని కనబరచట్లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×