Balti OTT : సెప్టెంబర్ 26న మలయాళ, తమిళ భాషల్లో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ‘బాల్టీ’. ఆ తరువాత వారమే తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిందో కూడా చాలామందికి తెలియదు. కానీ తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘బాల్టి’ (Balti) మూవీకి థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. కానీ ఇలాంటి సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాతో ఉన్ని శివలింగం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. హీరో షేన్ నిగమ్ కు మాత్రం 25వ సినిమా ఇది. అలాగే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఇందులో విలన్ గా నటించడం మరో విశేషం. ఇందులో శాంతను భాగ్యరాజ్, ప్రీతి అస్రానీ, అల్ఫోన్స్ పుత్రేన్, పూర్ణిమ ఇంద్రజిత్ వంటి తారాగణం కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఎస్టీకే ఫ్రేమ్స్, బిను జార్జ్ అలెగ్జాండర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంతోష్ టి కురువిల – బిను జార్జ్ అలెగ్జాండర్ నిర్మించారు. కబడ్డీని లోకల్ మాఫియా కథతో కలిపి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సిద్ధం చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో జనవరి 9 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
Read Also : తెలివైన అమ్మాయిల్నే కిడ్నాప్ చేసే సైకో… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఎంట్రీతో ఊహించని ట్విస్టులు
తమిళనాడు – కేరళ సరిహద్దులో వేలం పాళయం పట్టణంలో కథ సాగుతుంది. ముగ్గురు లోన్ మాఫియాలు అక్కడ జనాల్ని వడ్డీల పేరుతో పట్టి పీడిస్తూ ఉంటారు. వడ్డీలే కాదు వాటికి చక్రవడ్డీలు కూడా వేస్తారు. ప్రజల్ని చావగొట్టి మరీ డబ్బులు వసూలు చేస్తారు. మరోవైపు ఉదయన్, కుమార్, సురేష్, మణి అనే కబడ్డీ ఆటగాళ్ళు దూసుకెళ్లి దుమ్మురేపుతూ ఉంటారు. కబడ్డీలో వీళ్ళ మెరుపు వేగానికి మరే ఇతర కబడ్డీ జట్టు తట్టుకుని నిలబడదు. ముఖ్యంగా లోన్ మాఫియా భైరవన్ కు సంబంధించిన జట్టు వీళ్ళతో ఎప్పుడూ ఓడిపోతుంది. ఇంకోవైపు సోడా బాబు, గౌరీ అనే మరో ఇద్దరు లోన్ మఫియాలతో భైరవన్ కి వైరం సాగుతుంది. సోడా ఫ్యాక్టరీ ముసుగులో స్మగ్లింగ్ చేసేవాడే సోడాబాబు. వడ్డీలతో పేద స్త్రీలని దోపిడీ చేసే వాడు గౌరీ. ఈ ముగ్గురి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.
ఇదిలా ఉండగా, ఉదయన్ టీం ఒక వీధి ఫైట్ లో పాల్గొంటారు. ఆ టైమ్ లో వాళ్ళలో ఉన్న టాలెంట్ ను గమనించిన భైరవన్ డబ్బుతో తన ఉచ్చులో పడేలా చేస్తాడు. ఉదయన్ టీంని ఏకంగా లోన్ రికవరీ ఏజెంట్లుగా నియమిస్తాడు. ఇప్పుడు జనాలపై లోన్ రికవరీ పేరుతో దౌర్జన్యాలు చేయడం ఈ టీం వంతు అన్నమాట. ఈ నేపథ్యంలోనే లక్ష అప్పుగా తీసుకున్న ప్రదీప్ ను చక్రవడ్డీతో కలిపి 10 లక్షలు కట్టాలని కట్టేసి కొడతాడు భైరవన్. అతను తన ప్రేయసికి స్వయానా అన్నయ్య అని తెలుసుకున్న హీరో అడ్డుపడతాడు. అక్కడి నుంచి హీరోకి, భైరవన్ కి శతృత్వం మొదలవుతుంది. మరి క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.