E-Paper
Advertisement

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో నాలుగు రోజుల్లో డిలీట్ కాబోతున్న సినిమాలు… మిస్ అవ్వకూడదంటే వెంటనే చూడండి

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో నాలుగు రోజుల్లో డిలీట్ కాబోతున్న సినిమాలు… మిస్ అవ్వకూడదంటే వెంటనే చూడండి
Advertisement

OTT Movie : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలను స్మార్ట్ ఫోన్ లో కూడా చూసుకునే స్థాయికి ఇప్పుడు చేరుకున్నాము. అయితే ఏ సినిమా చూడాలి, ఏది వద్దనే నిర్ణయం తీసుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. థియేటర్లలో ఒక మంచి సినిమా వచ్చిందని తెలిసి దానిని చూద్దామనుకునే లోపు అది వెళ్లిపోతుంది. ఇక ఓటీటీలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తుతొంది. ఈ నేపథ్యంలో 2025 జూలై 31 లోగా నెట్‌ఫ్లిక్స్ నుంచి కొన్ని గొప్ప సినిమాలు కనుమరుగవనున్నాయి. ఇందులో కామెడీల నుంచి ఉత్కంఠభరిత థ్రిల్లర్ల వరకు, వైవిధ్యమైన చిత్రాలు ఉన్నాయి. వీటిని చూడకపోతే తొందరగా ఓ లుక్ వేయండి.

‘అమెరికాస్ స్వీట్‌హార్ట్స్’ (America’s Sweethearts) (2001)

Advertisement

జో రోత్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ సినిమాలో జూలియా రాబర్ట్స్ ఒక హాలీవుడ్ ప్రచారకర్తగా నటించారు. ఆమెతో పాటు కేథరీన్ జీటా-జోన్స్, జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. బిల్లీ క్రిస్టల్ కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. హాలీవుడ్ గ్లామర్ వెనుక ఉండే ప్రేమ, గందరగోళ సంబంధాలను ఈ చిత్రం సరదాగా చూపిస్తుంది.

‘పంచ్ డ్రంక్ లవ్’ (Punch-Drunk Love) (2002)

Advertisement

పాల్ థామస్ ఆండర్సన్ రూపొందించిన ఈ ఎంటర్టైనర్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్, బారీ ఎగాన్‌గా నటించారు. ఇతను కోప సమస్యలతో బాధపడే ఒక వ్యాపారి. ఎమిలీ వాట్సన్‌ అనే అమ్మాయితో అనుకోకుండా ప్రేమలో పడతాడు. ఈ లవ్ ట్రాక్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రం చమత్కారమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సాండ్లర్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.

‘రెడ్ ఐ’ (Red Eye) (2005)

వెస్ క్రావెన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌లో, రాచెల్ మెక్‌ఆడమ్స్ ఒక హోటల్ మేనేజర్‌గా, సిలియన్ మర్ఫీ ఒక అపరిచితుడిగా కనిపిస్తారు. అర్ధరాత్రి ఫ్లైట్‌లో వీరి సంభాషణ సాధారణంగా మొదలై, ఊహించని మలుపులతో ఉత్కంఠను పెంచుతుంది.

‘అవేకెనింగ్స్’ (Awakenings) (1990)

పెన్నీ మార్షల్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ డ్రామాలో రాబిన్ విలియమ్స్ ఒక వైద్యుడిగా, రాబర్ట్ డి నీరో కాటటోనిక్ రోగి గా నటించారు. ఒక అరుదైన చికిత్స రోగుల జీవితాలను ఎలా మారుస్తుందనేదే ఈ కథ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హార్ట్ ను టచ్ చేస్తుంది.

‘అమెరికన్ బ్యూటీ’ (American Beauty) (1999)

సామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఆస్కార్ విన్నింగ్ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసీ, లెస్టర్ బర్న్‌హామ్‌గా నటించారు. నగర శివారు ప్రాంతంలో రొటీన్ కు భిన్నంగా, ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఈ స్టోరీ నడుస్తుంది. అన్నెట్ బెనింగ్, థోరా బిర్చ్, మేనా సువారీ లాంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు.

Read Also : నిద్రలోనే పక్షవాతం తెప్పించి, తినేసే డెవిల్… హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×