BigTV English

OTT Movie : సిటీలో మిస్సింగ్ కేసులన్నీ ఈ ‘సేల్స్‌మన్’ కే లింక్… ఓటీటీలోకి వచ్చేసిన మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : సిటీలో మిస్సింగ్ కేసులన్నీ ఈ ‘సేల్స్‌మన్’ కే లింక్… ఓటీటీలోకి వచ్చేసిన మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ నటించిన ఒక యాక్షన్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. వీళ్లిద్దరి కాంబోలో ఈ సిరీస్ ఫుల్ జోష్ లో నడుస్తోంది. సీజన్ 1 (2023) లో విక్రమ్ (సునీల్ శెట్టి) ముంబై అండర్‌వరల్డ్‌లో లీనా థామస్ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. సీజన్ 2 ఆ కథని ముందుకు తీసుకెళ్తూ, ఎమోషన్స్, యాక్షన్, కొత్త విలన్‌ (జాకీ ష్రాఫ్)తో కేక పెట్టిస్తోంది.


రెండు ఓటీటీలో స్ట్రీమింగ్

‘Hunter: Tootega Nahi, Todega’ సీజన్ 2, 2025లో వచ్చిన హిందీ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి ప్రిన్స్ ధీమన్, అలోక్ బత్రా దర్శకత్వం వహించారు. యూడ్లీ ఫిల్మ్స్ దీనిని నిర్మించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్ ఎక్స్ ప్లేయర్‌ లలో 2025 జూలై 24 నుంచి 8 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అనుషా దండేకర్, బర్ఖా బిష్త్, ఈషా డియోల్, రాహుల్ దేవ్ మెయిన్ రోల్స్‌లో నటించారు. IMDbలో ఈ సిరీస్ కి 6.5/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

సీజన్ 2లో ACP విక్రమ్ సిన్హా (సునీల్ శెట్టి) ఒక రఫ్ అండ్ టఫ్ కాప్. తన కూతురు కిడ్నాప్ అవ్వడంతో పర్సనల్ మిషన్‌లో దూసుకెళ్తాడు. కథ ముంబై నుంచి థాయ్‌లాండ్ వరకు వెళ్తుంది. కొత్త విలన్ (జాకీ ష్రాఫ్) ఎంట్రీ ఇస్తాడు. ఇతను స్టైలిష్, కానీ డేంజరస్ ఆర్మ్స్ డీలర్. విక్రమ్ లైఫ్‌ని ఓ రేంజ్‌లో షేక్ చేస్తాడు. విక్రమ్ గతంలోని సీక్రెట్స్, ఫ్యామిలీ డ్రామా, బెట్రయల్స్ బయటపడతాయి. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ట్విస్ట్‌లతో కథ సూపర్ ఫాస్ట్‌గా నడుస్తుంది.

ఎనిమిది ఎపిసోడ్‌ ల వివరాలు

1. Shadows of the Past: విక్రమ్‌కి ఒక కొత్త కేసు వస్తుంది, అది అతని గతానికి కనెక్ట్ అవుతుంది. ఈ స్టోరీ డేంజర్ గానే స్టార్ట్ అవుతుంది.
2. The Salesman Arrives: విలన్ సేల్స్‌మన్ లా ఎంట్రీ ఇచ్చి, తన కూల్ వైలెన్స్‌తో కథని మలుపు తిప్పుతాడు.
3. Blood Ties: విక్రమ్ ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపడతాయి, అతని లైఫ్ కుదేలవుతుంది.
4. Bangkok Blues: కథ థాయ్‌లాండ్‌కి షిఫ్ట్ అవుతుంది. థాయ్ మాఫియా, కొత్త ఎనిమీస్ గందరగోళం సృష్టిస్తారు.
5. Truth and Lies: విక్రమ్ టీమ్‌లో బెట్రయల్స్ బయటపడతాయి, ఎవరు నమ్మదగినవాళ్లో, ఎవరు కొంప ముంచుతారో కన్ఫ్యూజన్ అవుతుంది.
6. Fire Within: విక్రమ్ ఫుల్ రేజ్‌లో ఉంటూ విలన్ ను టార్గెట్ చేస్తాడు.
7. The Reckoning: భయంకర ఫైట్స్, షోడౌన్ సీన్స్ జరుగుతాయి.
8. Tootega Nahi Todega: ఫైనల్‌లో విక్రమ్ న్యాయం కోసం, రివెంజ్ కోసం పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తన భార్యనో, కూతురినో ఎవరిని సేవ్ చేయాలనే టఫ్ ఛాయిస్ ఫేస్ చేస్తాడు. ఇక క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

చివరికి విక్రమ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు ? విలన్ ను ఎలా ఎదుర్కొంటాడు ? ఈ సిరీస్ మూడో సీజన్ కి కంటిన్యూ అవుతుందా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : ఈ జీన్స్ వేసుకుంటే పోతారు మొత్తం పోతారు… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మావా

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×