E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న హై-వోల్టేజ్ ఎరోటిక్ థ్రిల్లర్స్… ఒంటరిగా చూడాలి మావా

నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న హై-వోల్టేజ్ ఎరోటిక్ థ్రిల్లర్స్… ఒంటరిగా చూడాలి మావా
Advertisement

Netflix Top 5 Adult Thriller Series : ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు బోల్డ్, ఇంటెన్స్ కంటెంట్‌ తో ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. కేవలం అడల్ట్ సీన్లు మాత్రమే కాకుండా, బలమైన కథ, సస్పెన్స్, సైకలాజికల్ డెప్త్ ఉన్న సిరీస్‌ లు తెలుగు వెర్షన్ తో అందుబాటులో ఉండడంతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీకెండ్‌లో ఇంట్లో ఉండి ఇలాంటి ఉత్కంఠభరితమైన సినిమాలను చూడాలనుకునే వారి కోసమే ఈ లిస్ట్. ఈ టాప్ సిరీస్‌లు మరిచిపోకుండా ఒంటరిగా చూడండి.

1. ఒయాసిస్ (Oasis)

మానసిక సంఘర్షణలు, డార్క్ ఎమోషన్స్, ఆకర్షణలు కలిపిన రొమాంటిక్ డ్రామా సిరీస్. ఒక రహస్యమైన ప్రదేశం, అక్కడ జరిగే సంఘటనలు, గాయపడిన హృదయాలు, ప్రేమ మధ్య సాగే ఈ సిరీస్ చూస్తుంటే మీరు కూడా ఆ ఒయాసిస్‌లో చిక్కుకుపోతారు. బలమైన స్టోరీటెల్లింగ్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ డెప్త్ ఈ సిరీస్ హైలైట్‌లు.

2. వ్లాదిమిర్ (Vladimir)

Advertisement

ఇంటెన్స్ డ్రామా, సస్పెన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ కలిపిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌ లో ఉంది. రహస్యమైన గతం ఉన్న ఓ వ్యక్తి చుట్టూ సాగే కథ ఇది. ఇందులో ప్రేమ, ప్రతీకారం, మైండ్ గేమ్స్ అన్నింటినీ ఉత్కంఠభరితంగా మేళవించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ వెర్షన్ ఆడియోలతో అందుబాటులో ఉంది. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తాయి. డార్క్ ఎమోషన్స్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్.

3. ఫాటల్ సెడక్షన్: సీజన్ 3 (Fatal Seduction Season 3)

ఇప్పటికే మొదటి రెండు సీజన్లతో గ్లోబల్ ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న ఈ ఎరోటిక్ థ్రిల్లర్ సీజన్ 3తో మరింత ఇంటెన్స్‌గా వచ్చింది. ఒక మహిళా ప్రొఫెసర్, ఆమె జీవితంలోకి వచ్చిన రహస్యమైన యువకుడితో మొదలయ్యే ఆకర్షణ, ఆ తర్వాత జరిగే భయంకరమైన మర్డర్ మిస్టరీలు, ఊహించని ట్విస్టులు ఈ సీజన్‌ను సూపర్ హిట్ చేశాయి. కేవలం గ్లామర్ సీన్లు కాకుండా, మానసిక సంఘర్షణలు, రిలేషన్ డైనమిక్స్, సస్పెన్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ఒక్కసారి చూస్తే చివరి ఎపిసోడ్ వరకు కట్టిపడేస్తుంది.

4. రూమ్‌మేట్స్ (Roommates)

Advertisement

ఒకే రూమ్‌లో ఉండే ఇద్దరు వ్యక్తుల ఆకర్షణ మొదలవుతుంది. ఆ తర్వాత మారిన వారి జీవితాలు, సీక్రెట్స్ చుట్టూ సాగే బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. రొటీన్ జీవితంలోని ఆకర్షణలు, డార్క్ ట్విస్టులు, ఎమోషనల్ డెప్త్ ఈ సిరీస్‌ ను ప్రత్యేకం చేస్తాయి. చిన్న ఎపిసోడ్ లెంగ్త్‌తో సాగే ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ముగించే దాకా స్క్రీన్ నుంచి పక్కకు జరగరు. యువతకు బాగా కనెక్ట్ అయ్యే స్టోరీలైన్.

5. ఆఫీస్ రొమాన్స్ (Office Romance)

కార్పొరేట్ ఆఫీస్ వాతావరణంలో సహోద్యోగుల మధ్య సాగే ఆకర్షణ, ప్రేమ, సీక్రెట్స్, టెన్షన్ కలిపిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఆఫీస్ లైఫ్‌ తో ముడిపడిన రియల్ లైఫ్ ఎమోషన్స్, బోల్డ్ మూమెంట్స్, కామెడీ టైమింగ్ ఈ సిరీస్‌ను యువతకు ఇష్టమైనదిగా మార్చాయి. పని ఒత్తిడి, ఆఫీస్ రిలేషన్స్ గురించి ఆసక్తికరంగా చూపించారు. ఈ సిరీస్ లన్నీ కూడా Netflixలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Tags

Related News

పెళ్లి పీటలెక్కడానికి ముందే పెను విషాదం… తెలుగులోనే స్ట్రీమింగ్

దళపతి బర్త్ డే ట్రీట్… ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన విజయ్ టాప్ 5 మూవీస్ ఇవే

వీకెండ్ ఓటీటీలో వినోదం.. ఆ మూడు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సినిమాలు… ఒక్కటి కూడా మిస్ కావొద్దు భయ్యా

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదా… డోంట్ వర్రీ ఈ 5 అద్భుతమైన సినిమాలు ఫ్రీగానే చూడవచ్చు

ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం

నెట్ ఫ్లిక్స్ ను శాసిస్తున్న రూ.4566 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?

Big Stories

×