E-Paper
Advertisement

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

New Animated Series on OTT : ఓటీటీలో హారర్, ఫాంటసీ కథలు చూసేవారి కోసం ఈ వారం రెండు ఆసక్తికరమైన యానిమేటెడ్ సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక కథలో సాధారణ ఉద్యోగి జీవితంలోకి మరో ప్రపంచానికి చెందిన శక్తివంతమైన మాంత్రిక పక్షి ప్రవేశిస్తే, మరో కథలో దెయ్యాలతో నిండిన హోటల్‌ను నిర్వహించాల్సిన పరిస్థితి ఓ తల్లికి ఎదురవుతుంది. మాయాజాలం, వింత జీవులు, అతీంద్రియ శక్తులు, హాస్యం కలగలిసిన ఈ రెండు సిరీసుల రెండో సీజన్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవే ‘ససాకి అండ్ పీప్స్ సీజన్ 2’ (Sasaki and Peeps Season 2), ‘హాంటెడ్ హోటల్ సీజన్ 2’ (Haunted Hotel Season 2). అంతేకాదు ఈ రెండు సిరీస్ లు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

కథలోకి వెళ్తే…

ససాకి అండ్ పీప్స్ సీజన్ 2 స్టోరీ విషయానికి వస్తే… ససాకి (Sasaki) ఓ మధ్యవయస్కుడైన ఉద్యోగి. రోజూ ఆఫీసుకు వెళ్లడం, పని చేసుకోవడం, అదే రకమైన జీవితాన్ని గడపడం అతడికి విసుగు తెప్పిస్తుంది. జీవితంలో కొంత మార్పు రావాలనే ఉద్దేశంతో ఓ పెంపుడు పక్షిని కొనుక్కుంటాడు. దానికి పీప్స్ అని పేరు పెట్టుకుంటాడు. అయితే ఆ చిన్న పక్షి మరో ప్రపంచానికి చెందిన శక్తివంతమైన మాంత్రికుడు. ఈ విషయం తెలిశాక ససాకి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి ? ఒకవైపు తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు మాంత్రిక శక్తులు, వింత సంఘటనలు, రెండు ప్రపంచాలకు సంబంధించిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు ? చివరికి ఏమైంది ? అన్నది తెరపై చూడాల్సిందే.

Advertisement

ఇక రెండవ సిరీస్ ‘హాంటెడ్ హోటల్ సీజన్ 2’ ఇందులో కేథరిన్ అనే ఒంటరి తల్లి తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ హోటల్‌ను నిర్వహిస్తుంది. అయితే ఆ హోటల్‌లో అతిథులుగా వచ్చే వాళ్లు సాధారణ మనుషులు మాత్రమే కాదు. అక్కడ దెయ్యాలు, రాక్షస జీవులు, వింత అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి. వాటితో కలిసి జీవించడం, హోటల్‌ను నడపడం కేథరిన్‌కు సవాలుగా మారుతుంది. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఉండేది తన సోదరుడు. అతడు చనిపోయినప్పటికీ దెయ్యంగా అదే హోటల్‌లో ఉంటూ ఆమెకు సహాయం చేస్తుంటాడు. అంతేకాదు, ఓ చిన్న బాలుడి శరీరంలో బంధించబడిన రాక్షసుడితో సహా ఎన్నో వింత పాత్రలు ఈ హోటల్ చుట్టూ తిరుగుతుంటాయి. వాటి వల్ల ఎదురయ్యే సమస్యలు భయపెట్టడంతో పాటు నవ్వులు కూడా పుట్టిస్తాయి. ఈ విచిత్రమైన హోటల్‌ను ఆమె ఎలా నిర్వహిస్తుంది? అక్కడి దెయ్యాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అనేది రెండో సీజన్‌లో చూడాలి.

Also Read : గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

రెండూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

Advertisement

‘ససాకి అండ్ పీప్స్’ సీజన్ 2 అక్టోబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘హాంటెడ్ హోటల్ సీజన్ 2’ అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. మొదటి సిరీస్ జపనీస్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ కాగా, రెండోది ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ హారర్ కామెడీ. యానిమేషన్‌లో కొత్త ప్రపంచాలు, మాయాజాలం, దెయ్యాలు, వింత సాహసాలు ఇష్టపడేవారికి ఈ రెండు సిరీసులు మంచి ఆప్షన్లు.

Tags

Related News

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

Big Stories

Advertisement
×