E-Paper
Advertisement

రాఖీ స్పెషల్.. ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్స్..

రాఖీ స్పెషల్.. ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్స్..
Advertisement

Pawan Kalyan: దేశవ్యాప్తంగా నేడు (ఆగస్టు 28) న రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు సైతం రాఖీ పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి తన గొప్ప మనసును, అలాగే ఆడపడుచుల పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా అదిరిపోయే కానుకలను పంపించారు.

వితంతు, ఒంటరి మహిళలకు..

పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 45 ఏళ్లలోపు వితంతు, ఒంటరి మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా చీరలను కానుకగా పంపించారు. సుమారు 2439 మంది మహిళలకు ఈ కానుకలను అందజేసినట్లు తెలుస్తోంది. ఒంటరి, వితంతు మహిళలకు సోదరుడిగా భరోసా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ ఈ కానుకలను పంపించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు మహిళలకు పవన్ కళ్యాణ్ పంపిన కానుకలను అందజేశారు.

మహిళలకు కానుకగా చీరలు పంపిణీ..

Advertisement

ఇలా పవన్ పంపిన కానుకలను అందుకున్న మహిళలు తమ పట్ల పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయతల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో వద్ద రాఖీలు ఉంచి ఆయన చిత్రపటానికి హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు తమకు ఎవరు ఇలా రాఖీ పండుగ సందర్భంగా కానుకలు పంపించలేదు అంటూ పలువురు ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ సందర్భంగా చీరలను కానుకగా పంపించారనే విషయం తెలిసిన అభిమానులు పవన్ కళ్యాణ్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ఆయన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఎన్నికల హామీలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో బిజీగా గడుపుతూనే, మరోవైపు సినీ నటుడుగా సినిమాలలో నటిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలలో నటించకపోయిన ఈయన తదుపరి చేయబోయే ఓజీ 2 పనులు మాత్రం కొనసాగుతున్నాయి.

Also Read: నాని ది ప్యారడైజ్ లో ఛాన్స్ మిస్ చేసుకున్న నటి..ఆ చిన్న కారణంతో అంటూ!

Related News

‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

నాని ది ప్యారడైజ్ లో ఛాన్స్ మిస్ చేసుకున్న నటి..ఆ చిన్న కారణంతో అంటూ!

‘టాక్సిక్’ ఫ్లాప్ పై నయనతార క్రేజీ రియాక్షన్!

టాక్సిక్ తర్వాత యష్ చేయబోయే సినిమాలు ఇవే ?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్.. లుక్ టెస్ట్ పూర్తి?

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!

200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

Big Stories

Advertisement
×