OTT Movie : ఇద్దరు టీనేజర్లు ఒక దొంగిలించిన కారుతో ఫ్లోరిడాకు పారిపోవాలని కలలు కంటారు. కానీ ఒక విచిత్రమైన అపరిచితుడు కనిపించడంతో వారి ప్రయాణం భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఈ 11 నిమిషాల సినిమా అద్భుతమైన సినిమాటోగ్రఫీ, టెన్షన్‌తో నిండిన సస్పెన్స్ ఫుల్ సీన్స్, ఒక అస్పష్టమైన ఎండింగ్‌తో ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ టిక్‌టాక్‌లో వైరల్ అయ్యి, అందరి దృష్టిని ఆకర్షించింది. మరి వైరల్ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
కథ టీనేజర్లు అంబర్ (జోసెఫిన్ క్రిస్టోఫర్సన్), జేక్ (షెమర్ జోనాస్) చుట్టూ తిరుగుతుంది. వారు ఒక కారును దొంగిలించి, ఫ్లోరిడాకు పారిపోవాలనే కలలతో బయలుదేరతారు. కారు గ్లోవ్ బాక్స్ లో వారు ఒక తుపాకీని కనుగొంటారు. దీంతో వారి రిబెలియస్ ప్రయాణం ఒక ప్రమాదకరమైన టర్న్ తిరుగుతుంది. అంబర్ తల్లి నుండి ఊరికే ఫోన్ కాల్స్ వస్తాయి. ఆమెను తిరిగి ఇంటికి రమ్మని తల్లి కోరుతుంది. కానీ అంబర్ వాటిని పట్టించుకోదు.
ఈ ప్రయాణంలో ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు ఇద్దరూ. అంబర్ స్కినీ బట్టలన్నీ తీసేసి ఈత కోసం సరస్సులోకి వెళ్తుంది. జేక్ ను మాత్రం కళ్లు మూసుకుని ఒడ్డున లెక్కపెట్టమని చెబుతుంది. అంబర్ ఈత కొడుతున్నప్పుడు, ఒక అపరిచితుడు (టామ్ ఫ్రాంక్) అకస్మాత్తుగా కనిపిస్తాడు. అతని ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ భయంకరమైన వైబ్‌ను ఇస్తుంది. అతను అంబర్‌తో మాట్లాడుతూ జేక్ ఇప్పటికే చనిపోయాడనే షాకింగ్ విషయాన్ని చెబుతాడు. దీంతో ఆమె గందరగోళంలోకి పడుతుంది. అంబర్ జేక్ కోసం వెతుకుతూ ఒడ్డుకు తిరిగి వచ్చి, అతన్ని కనుగొనలేక, భయాందోళనలో కారులోకి ఎక్కి డ్రైవ్ చేస్తుంది.
ఆ సమయంలో, జేక్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అంటే అతను ఇంకా బ్రతికే ఉన్నాడన్న మాట. కానీ ఈ విషయం తెలిశాక రెండు చేతులు డ్రైవ్ చేస్తున్న అంబర్ మెడ వైపు వస్తాయి. ఆ అపరిచితుడు చెప్పినట్టు జేక్ నిజంగా చనిపోయాడా? లేదా అతను అంబర్‌ను మోసం చేసి, ఆమెను ఒంటరిగా చేయడానికి ఒక కుట్ర పన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : లవర్స్ ను మార్చుకుని ఆ పాడు పనులు చేసే అన్నాతమ్ముడు… ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా అయ్యా
యూట్యూబ్ లో స్ట్రీమింగ్
రాబీ బార్క్లే దర్శకత్వంలో తెరకెక్కిన అమెరికన్ షార్ట్ హారర్-థ్రిల్లర్ ఇది. ‘బ్యాక్‌స్ట్రోక్’ (Backstroke) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ 2017లో వచ్చింది. ఇందులో జోసెఫిన్ క్రిస్టోఫర్సన్, షెమర్ జోనాస్, టామ్ ఫ్రాంక్, లిన్ షెర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 11 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ పెద్దలకు మాత్రమే. 2017 మే 3న ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఇప్పుడు YouTubeలో ALTER ఛానెల్‌లో ఇంగ్లీష్ భాషలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది.