Income Tax Deduction : అమెరిన్ల సంపద విదేశాలకు దోచిపెట్టేందుకే సరిపోతుందంటూ ఆరోపిస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. అమెరికా పౌరులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నారు. వారందరికీ ఇప్పటి నుంచి ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ప్రతిపాదనలు చేశారు. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న ట్రంప్.. ఇన్ కమ్ ట్యాక్స్ రూపంలో తగ్గిన మొత్తాన్ని విదేశాలపై దిగుమతి సుంకాల ద్వారా భర్తి చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో.. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు విదేశాలపై పడనున్న ఆర్థిక బారం గురించి మిగతా దేశారు ఆందోళన చెందుతున్నాయి. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ట్రంప్ రెండోదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాకు నష్టం కలిగించేలా ఏ చర్యను ఉపేక్షించేది లేదని చెప్పారు. అందుకు తగ్గట్టే తాజా ఆదాయపు పన్ను తగ్గింపు, దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం
వెలువడింది.
ఆమెరికా పౌరులు సంపాదించిన సొమ్ముల్ని విదేశాలకు సాయాలు, రాయితీల పేరుతో దోచిపెట్టకుండా ఆ దేశ పౌరులో వినియోగించుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కష్టపడి సంపాదించింది, ఇతరులకు తగ్గడం అన్యాయం అంటూ ఆగ్రహించారు. అంతే.. తన చేతిలోని అధికారంతో ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేందుకు సిద్ధమయ్యారు. అలా చేయడం ద్వారా సగటు అమెరికా పౌరులు.. స్వేచ్ఛగా ఖర్చు చేసుకోగలుగుతారని, వారికి కావాల్సినవి కొనుక్కోగలుగుతారంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. ఆ సొమ్ములన్నీ తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తాయని, దాంతో మార్కెట్లో నిధుల ప్రవాహం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అమెరికా జాతీయాదాయంలో ఇన్ కమ్ ట్యాక్స్ సంతృప్తికర స్థాయిలోనే ఉంటోంది. అందుకే.. అమెరికా పౌరులకు పన్ను మినహాయింపు ఇచ్చి, ఆ మేరకు దిగుమతి సుంకాలను భారీగా విధించాలని భావిస్తున్నారు. ఈ విధానంలో ప్రజల ధనవంతులుగా మారే అవకాశం ఏర్పడుతుందని, అలాంటి వ్యవస్థ పనరుద్ధరణ దిశగా పన్ను రద్దు నిర్ణయం ఉపయోగపడుతుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలోఉంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దానిని భర్తీ చేసుకొనేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ఇతర దేశాలకు మేలు చేసేందుకు సొంత పౌరల్ని ఇబ్బంది పెట్టడం మూర్ఖమైన చర్యగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు.. అలాంటి విధానాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చాడు. బదులుగా.. తమను ఇన్నాళ్లు పన్నులు, అధిక సుంకాలతో వేధించుకు తిన్న ఇతర దేశాలపై అధిక పన్నులు విధించాలన్నారు. ఇందుకోసం.. ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీసును ప్రారంభించినట్లు రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read : చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ అరెస్టులు.. అమెరికాలోని ఇండియన్లకు అరెస్ట్‌ల భయం..
ట్రంప్ తాజా నిర్ణయాలతో దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోతున్నాయి. అదే జరిగితే.. అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలున్న 2023 ఆర్థిక సంవత్సరం (2022-2023) గణాంకాల ప్రకారం.. భారత్ నుంచి అగ్రరాజ్యానికి 78.3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 6.5 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ కు 38.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3.2 లక్షల కోట్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆటో మొబైల్ విడిభాగాలు, కన్జూమర్స్ గూడ్స్, మెకానికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. తన మొదటి పరిపాలన సమయంలో కూడా ఈ విషయమై పెద్ద రాద్దాంతం చేశారు. ఈ నేపథ్యంలోనే.. తాజా వ్యాఖ్యలను బట్టి భారత్ కు గట్టిగానే పన్ను భారం పడేలా కనిపిస్తోంది.