Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్ వెళ్లిన అమర్, ఆరును గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటాడు. పాత జ్ఞాపకాలను తలుచుకుని లోపల్లోపల ఏడుస్తుంటాడు. ఇంతలో మిస్సమ్మ వచ్చి అమర్‌ను ఓదారుస్తుంది. నాకు తెలుసండి అక్క లేని ఇంటికి రావడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ అమర్‌ను డైవర్ట్ చేయడానికి రూమ్ చాలా బాగుందండి. కానీ చలే కొంచెం ఎక్కువగా ఉందండి. పిల్లలు చెప్తే ఏంటో అనుకున్నాను కానీ ఇంత చల్లగా ఉంటుందనుకోలేదు. ఇక్కడి నుంచి చూస్తూ వ్యూ బాగుంటుందా అండి.. అంటూ కిటికీ తెరచి చూస్తుంది. చలికి వణికిపోతూ ఏవండి ఇంత చలి వేస్తుందేంటండి అంటుంది.
దీంతో అమర్ అలా చలి అని వణికే బదులు విండో క్లోజ్ చేసుకోవచ్చు కదా.? అని చెప్పగానే.. ప్రయత్నిస్తున్నానండి అవ్వడం లేదు అంటుంది మిస్సమ్మ. అమర్ వెళ్లి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటే మిస్సమ్మ అమర్‌ను హగ్ చేసుకుంటుంది. వెంటనే సారీ అండి చలి బాగా వేయడం వల్ల అనుకోకుండా.. అంటుంది. అమర్ వెళ్లిపోతుంటే.. ఏవండి చలి వేస్తుందండి.. చలి బాగా వేస్తుందండి అని మళ్లీ అనగానే.. అమర్ లూజ్ అని తిట్టి వెళ్లిపోతాడు. దీంతో మిస్సమ్మ చూస్తుంటే.. కొడైకెనాల్ చలి వల్ల నాకు చాలా ఉపయోగం ఉన్నట్టు ఉంది అని హ్యాపీగా ఫీలవుతుంది.
గుప్త తమిళ్ వ్యక్తిలాగా లగేజీ తీసుకుని లోపలికి వస్తాడు. గుప్తను గమనించిన అనామిక చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్లుతుంది. గుప్త గారు మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడగ్గానే.. గుప్త తెలుగు రాదు అని తమిళ్ లో చెప్తాడు. దీంతో అనామిక గుప్త గారు ఇది మీరే అని నాకు తెలుసు. యాక్టింగ్ ఆపి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగినా.. తమిళ్‌లో నాకు అర్థం కావడం లేదు అంటాడు. దీంతో అనామిక అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏదీ మీకు అర్థం కాదన్నమాట. అయితే మీరు మా గుప్త గారు కాదన్నమాట అంటుంది. గుప్త కాదు అని తమిళ్ లో చెప్తాడు. దీంతో అనామిక అయితే నేను ఇప్పుడు నేరుగా మా ఆయన దగ్గరకు వెళ్లి నా చావుకు కారణం, భాగీకి ఉన్న ప్రాణగండం మనోహరి అని చెప్పేస్తాను. మీరు వెళ్లి మనసు లాయే అని మీ భాషలో మాట్లాడుకోండి. మీకు తెలుగు తెలియదు కదా..? అంటూ అనామిక వెళ్లబోతుంటే గుప్త బాలిక ఆగుము.. అంటాడు.
దీంతో అనామిక వెనక్కి వచ్చి మీకు తెలుగు కొంచెం మాత్రమే వచ్చు అని చెప్పారు అని అడుగుతుంది. దీంతో గుప్త నేను మీ చిత్రవిచిత్రగుప్తుల వారమే ఈ వేషమున వచ్చితిమి అని చెప్తాడు. దీంతో అనామిక అలా రండి దారికి నాతోనే ఆటలా..? చెప్పండి ఇక్కడకు ఎందుకు వచ్చారు. అని అనామిక అడగ్గానే.. నీవు ఇప్పుడు చెప్పిన వలే చేసేదవేమో అని భయంతో వచ్చితిని అంటాడు గుప్త. దీంతో అనామిక మ ఆయనకు నిజం చెప్పేదాన్నే అయితే కొడైకెనాల్ దాకా ఎందుకు ఆగుతాను. హైదరాబాద్‌లోనే చెప్పేదాన్ని కదా.? అంటుంది. దీంతో గుప్త ఇచ్చట జరుగు సన్నివేషములు చూసి నువ్వు భావోద్వేగమునకు లోనై నిజం చెప్పెదవేమో అన్నది నా భయం అంటాడు గుప్త.
దీంతో అనామిక మీరు భయపడేంతగా ఇక్కడ ఏం జరుగుతుంది. అని అడుగుతుంది. గుప్త సైలెంట్‌గా ఉంటాడు. దీంతో అనామిక నేను ఏదైనా అడిగితే అది ప్రకృతికి విరుద్దం. విధికి ఎవ్వరూ ఎదురు వెళ్లకూడదు. వెళ్తే నా కుటుంబానికి ప్రమాదం అంతే కదా అంటుంది. దీంతో గుప్త అవును అంటాడు. దీంతో అనామిక అయినా మా ఆయనే నిజం తెలుసుకోబోతుంటే.. ఇంకా నేనెందుకు చెప్పాలనుకుంటాను గుప్త గారు. మను మొదలు పెట్టిన ఈ రక్తపాతాన్ని మా ఆయన అంతం చేస్తాడు అని చెప్పగానే.. గుప్త అది జరగవలసిన సమయంలో జరుగును. నువ్వు వెళ్లి వారు చేయబోయే కార్యమునకు అంతరాయం కలిగించకు. అంటూ గుప్త హెచ్చరించడంతో అనామిక సరేలేండి గుప్త గారు అంటుంది.
తర్వాత పిల్లలందరూ పతంగులు ఎగురవేస్తూ హ్యాపీగా ఉంటే ఇంతలో మరో పతంగి వస్తుంది. మిస్సమ్మ ఇంకో గాలి పటం ఎవరిది అని అడుగుతుంది. దీంతో మనోహరి నాదే అనుకుంటూ వస్తుంది. మనోహరిని చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో మనోహరి ఏం అనామిక నాతో ఆడతావా..? అని అడుగుతుంది. దీంతో అనామిక నీ మీద గెలవడానికి నేనెందుకు ఆడటం మనోహరి గారు. పిల్లలతో ఆడించి గెలపిస్తా..? అంటుంది. దీంతో మనోహరి వీళ్లతో ఆడాలా అంటుంది. ఇంతలో అంజు.. మనోహరి ఆంటీ మాతో కూడా గెలవలేరని మీరు భయపడుతున్నారా..? అనగానే సరే ఆడదాం అంటూ మనోహరి ఒప్పుకుంటుంది. పతంగులతో ఆట ఆడుతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?