Thriller Movie In OTT : ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలో కొత్త కొత్త కథలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో మిస్ అయ్యిన సినిమాలను ఓటీటీలోకి చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అదే విధంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తారు.. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వారానికి 30 పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ మూవీలకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మూవీ ఓటీటిలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీ ఏంటో? స్ట్రీమింగ్ ఎక్కడో ఒకసారి చూసేద్దాం..
కోలీవుడ్ థ్రిల్లర్ మూవీ నిరంగల్ మూండ్రు విభిన్నమైన ప్రయోగంగా తమిళ ప్రేక్షకుల్ని మెప్పించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళ్ ఓటీటీలో నిరంగల్ మూండ్రు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . తమిళంతోపాటు అదే రోజు నుంచి తెలుగులోనూ ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.. నిరంగల్ మూండ్రు సినిమాలో అమ్ము అభిరామి ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్‌చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన నిరంగల్ మూండ్రు మూవీలో అథర్వ మురళి, శరత్‌కుమార్, రెహమాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ మూవీకి కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ స్టోరీ ముగ్గురి జీవితాల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు పెట్టుకున్న సిద్దాంతాలు నమ్మకాలు దూరం అవుతాయి. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే అనే కాన్సెప్ట్‌తో నిరంగల్ మూండ్రు మూవీ తెరకెక్కింది.. టెక్నీకల్ పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు కన్ఫ్యూజ్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.. కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించిన ఐదో మూవీ ఇది. గతంలో దరువాంతల్ పథినారు, మాఫియా, మారన్‌తో పాటు మరో రెండు సినిమాలు చేశాడు. తొలి సినిమా తప్ప మిగిలినవేవి ఆకట్టుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఈ మూవీ కూడా పెద్దగా అలరించలేదు. ఇక ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..