BigTV English

Prasad Behara: కమిటీ కుర్రోళ్లు సినిమాలో నవ్వించిన పెద్దోడు జీవితంలో ఇంత విషాదమా.. ?

Prasad Behara: కమిటీ కుర్రోళ్లు సినిమాలో నవ్వించిన పెద్దోడు జీవితంలో ఇంత విషాదమా.. ?

Prasad Behara: నవ్వడం ఒక భోగం..  నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అని జంధ్యాల చెప్పిన మాట అక్షర సత్యం. నిత్యం తీరిక లేకుండా పనులు చేస్తూ.. నవ్వడం కూడా మర్చిపోతున్నారు చాలామంది. ఇక ఒకప్పుడు కమెడియన్స్ లా సినిమాల్లో ఇప్పుడున్న వారు నవ్వించడం లేదు అంటే  అతిశయోక్తి కాదు. ఇప్పుడు కామెడీ షోస్ అన్ని బూతు షోస్ గా మారిపోయాయి. బ్రహ్మానందం, సునీల్, అల్లరి నరేష్.. ఇలా  నవ్వించేవారందరూ ఆ కామెడీని పక్కన పెట్టి వేరే వేరే  జోనర్స్ లో కనిపిస్తున్నారు.


ఇప్పుడు పూర్తి కమెడియన్స్ ఎవరు ఉన్నారు అంటే .. వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అయితే ఆ సమయంలోనే  ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు ప్రసాద్ బెహరా.  ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   చిన్న యూట్యూబర్  గా కెరీర్ ను ప్రారంభించిన  ప్రసాద్.. మా విడాకులు అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సిరీస్ లో ప్రసాద్ డైలాగ్స్, పంచ్ లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎక్కడ చూసిన కూడా ఈ సిరీస్ కు సంబంధించిన రీల్స్ నే. అలా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఒక్కసారిగా స్టార్ యూట్యూబర్ గా మారాడు.

Rashmika: విజయ్ దేవరకొండ Vs బన్నీ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?రష్మిక ఊహించని కామెంట్..!


మా విడాకులు తరువాత పెళ్లి వారమండీ  అనే సిరీస్ ను  తెరకెక్కించాడు. ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు సీజన్స్  రిలీజ్ చేశారు. మూడు సీజన్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వెబ్ సిరీస్ వలన వచ్చిన గుర్తింపుతో మెగా డాటర్ నిహారిక.. ప్రసాద్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె నిర్మాతగా  కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దోడుగా ప్రసాద్ నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.

కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా  అందరిచేత కంటతడి పెట్టించాడు. ఇక అందరిని నవ్వించే ప్రసాద్ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా  పెళ్లి విషయంలో ప్రసాద్ చాలా సమస్యలను ఎదుర్కున్నాడు. పెళ్లి అయిన కొన్ని నెలలకే భార్య  విడిపోవడం.. ఆ బాధనే మా విడాకులు సిరీస్ గా  తీసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రసాద్ భార్య ఎవరో కాదు జాను నారాయణ. ఆమె కూడా నటినే. వీరిద్దరూ  కలిసి   కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేశారు. రెండేళ్లు రిలేషన్ లో ఉండి.. పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లి తరువాత విభేదాల వలన కొన్ని నెలలకే విడిపోయారట.

Prabhas in Kannappa : ఓపిక పట్టండి… ‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్‌పై విష్ణు షాకింగ్ రిప్లై

ఇక ఈ విషయం గురించి ప్రసాద్ మాట్లాడుతూ.. ” తొందరపడి పెళ్లి చేసుకున్నాను.  మేము విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు. నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు. ఈ విషయాన్నీ ఆ అమ్మాయే ముందు రియలైజ్ అయ్యింది. నెమ్మదిగా నాకు అర్ధమయ్యింది. నాకు ఆ లవ్ అది ఉండడంతో నేను కొద్దిగా  లేట్ గా రియలైజ్  అయ్యాను. ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మేము విడిపోయి రెండేళ్లు అవుతుంది. విడాకులు మాత్రం రీసెంట్ గా వచ్చాయి.

సక్సెస్ వచ్చినప్పుడు పెయిన్ చాలా ఉంటుంది. అది తట్టుకుంటూనే దాన్ని చూడగలము. నేను నా బాధను తట్టుకోవడానికి ఖాళీ లేకుండా పనిచేస్తన్నా. ఎవరు చనిపోయినా.. ఎవరు పెళ్లి చేసుకుంటున్నా.. ? వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాను.  అంతగా పని బిజీలో పడిపోయాను” అని చెప్పుకొచ్చాడు. అయ్యో .. ప్రేక్షకులందరిని నవ్వించే ప్రసాద్ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×