Indian Railways Train Tickets Booking Apps: భారతీయ రైల్వే సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ IRCTC ద్వారా చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ యాప్ తో పాటు మరికొన్ని యాప్ ద్వారా కూడా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాంటి యాప్స్ లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ Confirmtkt
Confirmtkt యాప్ ద్వారా ట్రైన్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రత్యామ్నాయ రైళ్లను తనిఖీ చేయడంతో పాటు పాటు కన్ఫర్మ్ టికెట్లను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుకోని కారణాలతో ప్రయాణం వాయిదా పడితే, టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి స్థాయి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ 24/7 కస్టమర్ సపోర్టును కూడా అందిస్తుంది. ట్రైన్ కరెంట్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. బుక్ చేసిన రైలుకు సంబంధించిన విషయాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ప్రస్తుతం Google Play స్టోర్ ద్వారా 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.
⦿ ixigo
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్ లలో ixigo ఒకటి. దీని ద్వారా ట్రైన్ టికెట్లను త్వరగా, వేగంగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది IRCTCతో లింక్ అప్ అయి ఉంది. ఈ యాప్ ప్రస్తుతం Google Play Storeలో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఇందులో రైలు టికెట్ బుకింగ్స్ తో పాటు హోటళ్లు, విమానాలు, బస్సు టికెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ RedRail
RedBus అనేది RedRail లాంటి ఓ యాప్. దీని ద్వారా రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే, వేగంగా రీఫండ్ అందిస్తుంది. ఈ యాప్ సాయంతో PNR స్టేటస్, కరెంట్ ట్రైన్ స్టేటస్ ను తనిఖీ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ప్రస్తుతం Google Play Storeలో 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.
Read Also: ఐఆర్‌సీటీసీ.. సూపర్ యాప్ కు మధ్య తేడా ఇదే, టికెట్ బుకింగ్ తోపాటు మరెన్నో!
⦿ MakeMyTrip
MakeMyTrip భారతీయులు ఎక్కువగా ఉపయోగించే యాప్. ఈ యాప్ కన్ఫర్మ్ టికెట్లను పొందేందుకు అనుకూలంగా ఉన్న పలు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే టికెట్ మొత్తంతో పాటు అదనపు డబ్బులను అందిస్తుంది. సీట్ లాక్ ఫీచర్ తో ఛార్జీలో 25% చెల్లించడం ద్వారా కన్ఫర్మ్ టిక్కెట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ రైలు కరెంట్ స్టేటస్ తో పాటు, PNR స్టేటస్ ను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం Google Play Storeలో 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.
Read Also: వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్ఫర్మేషన్ వెనుక ఇంత కథ ఉందా? అసలు విషయం చెప్పిన రైల్వే సంస్థ!