BigTV English
Advertisement

Thammudu Ott: తమ్ముడు ఓటీటీ డేట్ లాక్… రిలీజ్ అప్పుడేనా?

Thammudu Ott: తమ్ముడు ఓటీటీ డేట్ లాక్… రిలీజ్ అప్పుడేనా?

Thammudu Ott: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న నితిన్(Nithin) ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకుంటూ ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు. ఇకపోతే తమ్ముడు(Thammudu) సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలనే కసితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా తమ్ముడు సినిమా కూడా పూర్తిస్థాయిలోనే నితిన్ అభిమానులను నిరాశపరిచింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోని నేపథ్యంలో ఓటీటీ విడుదలకు(Ott Release) సిద్ధమయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


నెల తిరగకుండానే ఓటీటీలోకి…

ఈ క్రమంలోనే ఈ సినిమాని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న డీల్ ప్రకారం థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయబోతున్నారు. జులై 4వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని వార్తలు వినపడుతున్నాయి. అయితే అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


నిరాశపరిచిన తమ్ముడు..

డైరెక్టర్ వేణు శ్రీరామ్ (Venu Sriram)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా సీనియర్ నటి లయ కూడా రీఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో నితిన్ లయకు తమ్ముడు పాత్రలో నటించారు. ఈ సినిమా అక్క తమ్ముడు మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవటం గమనార్హం. ఇక నితిన్ ఈ సినిమా తర్వాత సినిమాని దిల్ రాజు నిర్మాణంలోనే చేయబోతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) దర్శకత్వంలో “ఎల్లమ్మ” (Yellamma)అనే సినిమాను ప్రకటించారు.

ఎల్లమ్మ పైనే నితిన్ ఆశలు…

ఈ సినిమాకు ముందుగా నాని కమిట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పకున్న నేపథ్యంలో నిజం ఎల్లమ్మ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ్ముడు సినిమాతో ఎంతో నిరాశపరిచిన నితిన్ ఎల్లమ్మ ద్వారా అయిన అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ సినిమా కోసం నితిన్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తున్నారని సమాచారం. సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ అయిన తర్వాతనే రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికే వేణు డైరెక్షన్లో బలగం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఎల్లమ్మ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎల్లమ్మ సినిమా అయినా నితిన్ కు సక్సెస్ అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read: Sreeleela: జూనియర్‌లో స్క్రీన్ టైం చాలా తక్కువ… రెమ్యూనరేషన్ మాత్రం డబల్?

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×