BigTV English

Jitesh Sharma : ఇంగ్లాండ్ లో జితేష్ శర్మకు ఘోర అవమానం.. స్టేడియం గేటు నుంచే బయటికి పంపించారు !

Jitesh Sharma : ఇంగ్లాండ్ లో జితేష్ శర్మకు ఘోర అవమానం.. స్టేడియం గేటు నుంచే బయటికి పంపించారు !

 Jitesh Sharma :   ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు టెస్టు సిరీస్ మ్యాచ్ లు జరిగిన విషయం తెలిసిందే. ఇంకా మిగిలిన రెండు మ్యాచ్ లు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ కోసం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో యాషెస్ సిరీస్ లో ఆటంకాలు జరగడంతో భారీ బందోబస్తు నిర్వహించారు. లార్డ్స్ లో భారత వికెట్ కీపర్ మరియు బ్యాటర్ జితేష్ శర్మకి ఒక అడ్డంకి వచ్చిందనే చెప్పాలి. అతను తన గుర్తింపును నిరూపించుకోవాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది అతన్ని లోపలికి అనుమతించే ముందు ఇంతలోనే ఓ భారత క్రికెట్ అభిమాని కనిపించాడు. ఎంట్రీ పాయింట్ వద్ద జితేష్ ని లోపలికి అనుమతించకపోవడంతో వారితో సంభాషించాడు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని లోపలికి అనుమతించలేదు.


Also Read :  Rohit -Gill: గురువు గారు అంటూనే… రోహిత్ శర్మ కొంపముంచిన గిల్ !

జితేష్ శర్మను గుర్తించడంలో విఫలం.. 


ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది జితెష్ శర్మను గుర్తించడం లో విఫలం చెందారు. చివరికీ జితేష్ శర్మ టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తిక్ అదృష్టవశాత్తు బయటికి వచ్చాడు. ఫోన్ కాల్ మాట్లాడేందుకు బయటికి వచ్చిన కార్తిక్ గుర్తించి ఆ తరువాత జితేష్ అరిచాడు. దీంతో ఆ సమయంలో టీమిండియా అభిమానులు కూడా అరిచారు. ఈ అరుపుల మధ్య దినేష్ కార్తిక్ కాల్ లో మాట్లాడుతుండటంతో జితేష్ ని గమనించలేకపోయాడు. చివరికీ జితేష్ కి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు అతన్ని పెద్ద క్యూ లైన్ నుంచి బయటికీ తీసుకొచ్చాడు కార్తీక్.  ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ విజయం సాధించడంలో జితేష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించింది ఆర్సీబీ. 

వారిదే టెస్ట్ సిరీస్.. 

వాస్తవానికి జితేష్ శర్మ 2023లో భారత్ లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి జితేష్ ఇప్పటివరకు భారత్ తరపున  ఏడు  టీ-20లు ఆడాడు.  వన్డే, టెస్ట్ క్రికెట్ లో ఇంకా దేశానికి ప్రాతినిధ్యం వహించలేదు. భారత జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైంది. అలాగే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. మూడో టెస్టు లో మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికీ 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 2-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టు కాస్త ముందంజలో కొనసాగుతోంది. మిగిలన రెండు టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తే.. సిరీస్ కైవసం చేసుకుంటుంది.  భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జులై 23న మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ లండన్ లోని ఓవల్ లో జులై 31 నుంచి ఆగస్టు 04 వరకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ గెలుస్తుంది. లేదంటే ఇండియా రెండు గెలిస్తే.. ఇండియా సిరీస్ విజయం సాధిస్తుంది.


Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×