BigTV English

Sreeleela: జూనియర్‌లో స్క్రీన్ టైం చాలా తక్కువ… రెమ్యూనరేషన్ మాత్రం డబల్?

Sreeleela: జూనియర్‌లో స్క్రీన్ టైం చాలా తక్కువ… రెమ్యూనరేషన్ మాత్రం డబల్?

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే.అతి త్వరలోనే జూనియర్(Junior) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో వారాహి నిర్మాణ సంస్థలు తెరకెక్కిన ఈ సినిమా జూలై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సీనియర్ నటి జెనీలియా(Genelia) రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.


డబల్ రెమ్యూనరేషన్..

ఇక ఈ సినిమాలో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి(Gali Kireeti Reddy) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఛాన్స్ అంటుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించడం కోసం శ్రీ లీల భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. నిజానికి శ్రీ లీలకు ఇది మొదటి సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కమిట్ అయినప్పుడు ఈమె కోటి రూపాయలు రెమ్యూనరషన్ (Remuneration) తీసుకున్నారట అయితే మొదటి భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో శ్రీ లీల ఇతర సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.


సెకండ్ హాఫ్ లో కనిపించని శ్రీలల?

మొదటి భాగం షూటింగ్ పూర్తి అయ్యేసరికి శ్రీ లీలా మరో రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా కోసం ఈమె ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం. అయితే మొదటి భాగం పూర్తి అయిన తర్వాత సినిమా ఆలస్యమవుతుందని నేపథ్యంలో ఇతర సినిమాలకు కమిట్ కావడంతో ఈమె సెకండ్ హాఫ్ లో కనిపించరని సమాచారం. శ్రీ లీల లేకుండానే సెకండ్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా జూనియర్ సినిమాలో శ్రీ లీల స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుందని ఇలా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ ,రెమ్యూనరేషన్ మాత్రం డబల్ తీసుకున్నారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ లో వరుస అవకాశాలు..

శ్రీలీల ప్రస్తుతం ఈ సినిమాతో పాటు తెలుగులో మాస్ జాతర అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈమె కార్తీక్ ఆర్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే అట్లీ డైరెక్షన్లో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల ఎంపికైనట్టు సమాచారం. అయితే ఇటీవల కాలంలో సరైన హిట్ సినిమాలు లేకపోయినప్పటికీ శ్రీ లీలకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు రావడం విశేషం.

Also Read: Athadu Re Release: అతడు రీ రిలీజ్… టార్గెట్ చేరుకోవడం కష్టమే.. నష్టాలు తప్పవా?

Related News

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

OG Movie : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీలో శాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్.. హిట్ పక్కా..!

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Big Stories

×