BigTV English

OTT Movie : ఒంటరి జీవితం… ఒక గొప్ప ప్రయాణం… మూడు ఆస్కార్ లు గెలిచిన ఫీల్ గుడ్ మూవీ

OTT Movie : ఒంటరి జీవితం… ఒక గొప్ప ప్రయాణం… మూడు ఆస్కార్ లు గెలిచిన ఫీల్ గుడ్ మూవీ

OTT Movie : సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసమే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా ఉంటాయి. వీటిని ఎంటర్టైన్మెంట్ గా కాకుండా, తాతయ్య, అమ్మమ్మ చెప్పే కథల్లాగా తీసుకుంటే మంచి మెసేజ్ ని ఇస్తాయి. ఒంటరి జీవితం ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల తోడు, పెద్దయ్యాక లైఫ్ పార్ట్నర్, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఏదో ఒక తోడు కచ్చితంగా అవసరం అవుతుంది. అటువంటి ఒంటరి జీవితాలు గడిపే కొంతమంది వ్యక్తుల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఇటువంటి మూవీని ఎంటర్టైన్మెంట్ గా కాకుండా, జీవిత పాఠం నేర్పే ఒక మూవీగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘నోమాడ్‌ల్యాండ్’ (Nomadland). 2020లో విడుదలైన ఈ అమెరికన్ డ్రామా మూవీకి  క్లోజ్ జావో దర్శకత్వం వహించారు. ఇందులో ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్ ఒక వితంతువుగా నటించారు, ఆమె తన జీవితాన్ని నెవాడాలో వదిలి తన వ్యాన్‌లో యునైటెడ్ స్టేట్స్ చుట్టూ తిరుగుతుంది.  నోమాడ్‌ల్యాండ్ సెప్టెంబర్ 11, 2020న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. $5 మిలియన్ల బడ్జెట్‌ తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $39 మిలియన్లు వసూలు చేసి బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ నెవాడాలో యూఎస్ కంపెనీ స్థాపించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలో, ఒక మారుమూల ప్రాంతంలో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే మొదట ఆ కంపెని లాభాల బాటలో ఉంటుంది. ఆ తర్వాత ఆ కంపెని నష్టాల బాటలోకి వెళ్లిపోతుంది. ఆ కంపెని నష్టాలతో క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్లు మరో ప్రయాణం మొదలుపెడతారు. అందులో హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ ఆ ప్రాంతంలో తన భర్తతో హ్యాపీగా ఉండేది. కొంతకాలం క్రితం తన భర్త చనిపోవడంతో ఒంటరిగా అయిపోతుంది. ఇప్పుడు కంపెనీ కూడా క్లోజ్ అవ్వడంతో, బతకడానికి మరో ప్రయాణం మొదలు పెడుతుంది. హీరోయిన్ కి అమెజాన్ కంపెనీలో ఒక జాబ్ దొరుకుతుంది. ఆమె నివసించడానికి తన కారుని నివాసంగా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ప్రాంతంలో లిండా అనే అమ్మాయి, హీరోయిన్ కి పరిచయం అవుతుంది. లిండా హీరోయిన్ కి తాను ఒక ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తుంది. అక్కడ మనలాంటి మనుషులు ఉంటారని, అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందని కూడా చెప్తుంది.

మొదట హీరోయిన్ అక్కడికి రావడానికి ఒప్పుకోదు. ఆ తర్వాత తనకి ఆ ప్రాంతంలో అద్దె ఇల్లు దొరకకపోవడంతో, చేసేదేం లేక ఆ ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఆ ప్రాంతంలో హీరోయిన్ మాదిరిగా ఒంటరి వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళ నుంచి, పేదవాళ్ల వరకు తమకు నచ్చిన పనిని గ్రూపులుగా వెళ్లి పని చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. ఇది చూసి హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. అక్కడ హీరోయిన్ కి కొంతమంది పరిచయం అవుతారు. ఆ తర్వాత వాళ్లు కూడా దూరమవుతారు. ఈ ప్రయాణంలో హీరోయిన్ చెందే అనుభూతి, తెలుసుకునే విషయాలు మనుషులను బాగా ఆలోచింపజేస్తుంది. ఈ మూవీని సమయం ఉన్నప్పుడు, ఒకవేళ సమయం లేకపోతే కాస్త కేటాయించి చూడండి. అప్పుడప్పుడు ఇటువంటి సినిమాలు చూస్తూ ఉంటే కాస్త మనసుకు రిలీఫ్ దొరుకుతుంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×