WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Women’s Premier League )… నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఫ్యాన్స్ ఆశలు నేటితో నెరవేరునున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహాలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women’s Premier League ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్.. గుజరాత్ జైంట్స్ ( Gujarat Giants Women ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru Women ) జట్ల మధ్య… జరగనుంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది..ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్..హైదరాబాద్ లోనే ?
ఈ రెండు జట్ల మధ్య వడోదర వేదికగా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే సాయంత్రం ఏడు గంటల సమయంలో… గుజరాత్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్ను… స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తోంది.
అలాగే డిస్నీ హాట్ స్టార్ లో కూడా మనం చూడవచ్చు. అయితే… హాట్ స్టార్ లో కొంతమంది మాత్రమే ఫ్రీగా చూడవచ్చు. ఎవరైతే హాట్ స్టార్ రీఛార్జ్ తీసుకుని వాడుతున్నారో వాళ్లు మాత్రమే ఉచితంగా చూసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మెగా టోర్నమెంటులో ఏకంగా ఐదు జట్లు పాల్గొనబోతున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి అయ్యాయి. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women’s Premier League ) 2023 సంవత్సరంలో ప్రారంభమైంది. 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా రెండవ సీజన్లో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru Women ) విజయం సాధించింది. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 25 టోర్నమెంట్ లో మొత్తం 20 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. రెండు నాకౌట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి మార్చి 15వ తేదీ వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. మార్చి 15వ తేదీన.. ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
Also Read: Champions trophy: బీసీసీఐ క్రూరత్వం.. టీమిండియా ప్లేయర్లకు సుఖం లేకుండా చేస్తున్న కొత్త రూల్స్ ?
గుజరాత్ vs బెంగళూరు జట్ల వివరాలు
గుజరాత్ జెయింట్స్ : 1 బెత్ మూనీ (W), 2 లారా వోల్వార్డ్, 3 హర్లీన్ డియోల్, 4 డియాండ్రా డోటిన్, 5 దయాలన్ హేమలత, 6 ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), 7 సిమ్రాన్ షేక్, 8 సయాలీ సత్‌ఘరే, 8 మేఘనాష్ కన్వార్, 1 తనూత్ 10, 1 తను10 షబ్నమ్ షకీల్/మన్నత్ కశ్యప్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 1 స్మృతి మంధాన (కెప్టెన్), 2 డాని వ్యాట్-హాడ్జ్, 3 ఎస్ మేఘన, 4 ఎలీస్ పెర్రీ, 5 రిచా ఘోష్, 6 రాఘవి బిస్ట్, 7 కనికా అహుజా, 8 జార్జియా వేర్‌హామ్, 9 సింఘ్‌ను గర్త్కా 10. గర్త్కా 11,