E-Paper
Advertisement

సొంత సైన్యంలోనే కోవర్ట్… రెండవ ప్రపంచ యుద్ధం వెనుకున్న మిస్టరీ… యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన వార్ థ్రిల్లర్

సొంత సైన్యంలోనే కోవర్ట్… రెండవ ప్రపంచ యుద్ధం వెనుకున్న మిస్టరీ… యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన వార్ థ్రిల్లర్
Advertisement

Norwegian War Thriller: ప్రపంచ చరిత్రను మార్చేసిన సంఘటనల్లో రెండవ ప్రపంచ యుద్ధం అత్యంత కీలకమైంది. ఆ కాలంలో జరిగిన ఎన్నో అరాచకాలు, వెన్నుపోట్లు ఇప్పటికీ చాలామందికి తెలియవు. అలాంటి ఒక మోస్ట్ షాకింగ్ అండ్ మిస్టరీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన నార్వేజియన్ వార్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ట్రైటర్ వితిన్’ (The Traitor Within). నార్వేలో అప్పట్లో ఏం జరిగింది ? అనే కథాంశంతో రూపొందిన ఈ హై-వోల్టేజ్ రా అండ్ రస్టిక్ వార్ డ్రామా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ నార్వేను ఆక్రమించిన రోజుల్లో కథ మొదలవుతుంది. హెన్రీ రిన్నన్ సేల్స్‌మ్యాన్. జీవితంలో పెద్దగా గుర్తింపు లేని అతను, సమాజంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటాడు. అయితే ఆ కోరిక క్రమంగా అతన్ని ప్రమాదకరమైన దారిలోకి తీసుకెళ్తుంది. నాజీ జర్మనీకి చెందిన గెస్టాపో ఇంటెలిజెన్స్ విభాగంలో ఏజెంట్‌గా మారిన రిన్నన్, తన తెలివితేటలను దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం మొదలుపెడతాడు. అక్కడితో ఆగకుండా, నార్వేలో నాజీ ఆక్రమణను ఎదిరిస్తున్న ప్రతిఘటన ఉద్యమంలోకి చొరబడేందుకు ఒక రహస్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాడు.

Advertisement

రిన్నన్ చేసే పని స్పై మాత్రమే కాదు. అతను ఉద్యమానికి చెందిన వ్యక్తిలా నటిస్తూ, వారి నమ్మకాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత వారి ప్రణాళికలు, రహస్య కార్యకలాపాలు, కీలక సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తాడు. తనతో కలిసి పనిచేసే యువతీ యువకులను కూడా ఈ రహస్య వ్యవస్థలో భాగం చేస్తాడు. ఇలా బయటకు చూస్తే నార్వే ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తుల్లా కనిపించే కొందరు, లోపల మాత్రం నాజీ అధికారులకు సమాచారం అందిస్తుంటారు. ఈ ద్రోహం కారణంగా ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు తీవ్రమైన ప్రమాదంలో పడతారు.

రిన్నన్ తన కార్యకలాపాలను మరింత విస్తరించి ‘రిన్నన్ గ్యాంగ్’ పేరుతో ఒక రహస్య బృందాన్ని నడుపుతాడు. శత్రువులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కంటే, తమ మధ్యే దాగి ఉన్న ద్రోహులను గుర్తించడం మరింత కష్టంగా మారుతుంది. ఇదే సమయంలో ప్రతిఘటన ఉద్యమ నాయకుడు ఒడ్డ్ సోర్లీ రంగంలోకి దిగుతాడు. రిన్నన్ చేస్తున్న ద్రోహాన్ని అడ్డుకోవడం, అతని రహస్య నెట్‌వర్క్‌ను బయటపెట్టడం అతని లక్ష్యం. సాధారణ వ్యక్తిగా మొదలైన హెన్రీ రిన్నన్, గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాల్లో తన సొంత దేశ ప్రజలకే శత్రువుగా ఎలా మారాడు ? అతని రహస్య నెట్‌వర్క్‌ను సోర్లీ ఎలా ఎదుర్కొన్నాడు ? నాజీ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని వెన్నుపోటు నుంచి ఎలా కాపాడాలి ? అనే విషయాలు తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

Advertisement

‘ది ట్రైటర్ వితిన్’ ఒరిజినల్ టైటిల్ ‘రిన్నన్’ పేరుతో అక్టోబర్ 30న నాలుగు ఎపిసోడ్లతో విడుదలైంది. ఈ సిరీస్ నార్వేజియన్ భాషలో రూపొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో హెన్రీ రిన్నన్ పాత్రలో ఆక్సెల్ బోయుమ్ (Axel Bøyum), ఒడ్డ్ సోర్లీ పాత్రలో ఓడిన్ వాగే (Odin Waage) నటించారు. ఆండ్రియా బెర్ట్జెన్ (Andrea Berntzen), హాకోన్ స్టెనే (Håkon Stene), ఎల్లా ఓవెడి న్యుగార్డ్ ఆస్పెన్ (Ella Ovedie Nygaard Aspen), రాండిన్ మికేల్ కుమ్నెజే (Randin Mikael Kumneje) తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. కెన్నెత్ కార్ల్‌స్టాడ్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే హిస్టరీ లవర్స్‌కి ‘ది ట్రైటర్ వితిన్’ ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Read Also: రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

Related News

తెలియని నంబర్ నుంచి ఆ ఫోన్ కాల్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో అలరించే తమిళ్ క్రైమ్ కామెడీ

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

ఏలకుల తోటలో అర్ధరాత్రి దుండగుల దాడి… భర్తను కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం… మైండ్ బ్లాక్ చేసే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్‌

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?

Big Stories

Advertisement
×