E-Paper
Advertisement

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?
Advertisement

November 2026 OTT Releases: సినిమా ప్రియులకు నవంబర్ నెల ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది. థియేటర్లలో సినిమాలు చూడటంతో పాటు ఇంట్లోనే కొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ నెలలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో నవంబర్ నెలంతా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు, కామెడీ సిరీస్‌లు, బయోపిక్స్, యానిమేటెడ్ చిత్రాలు ఇలా అన్ని జోనర్లలోనూ కంటెంట్ సిద్ధంగా ఉంది. మీరు ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా ? అయితే నవంబర్ నెల ఓటీటీ రిలీజ్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

నవంబర్ 1 నుంచి 5 వరకు…

నవంబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో అమెరికన్ కోర్ట్‌రూమ్ డ్రామా సిరీస్ ‘ది రెయిన్‌మేకర్’, డ్రామా మూవీ ‘ది పెలికాన్ బ్రీఫ్’ అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ కామెడీ మూవీ ‘జింగిల్ ఆల్ ది వే’, యానిమేటెడ్ మూవీ ‘ఆల్ డాగ్స్ గో టు హెవెన్’ ప్రేక్షకులను అలరించనున్నాయి. నవంబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్యామిలీ మూవీ ‘ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్’, జియోహాట్‌స్టార్‌లో పిల్లల కోసం రూపొందించిన అడ్వెంచర్ కామెడీ ‘మినియన్స్ అండ్ మాన్స్టర్స్’ రానున్నాయి. ఇక నవంబర్ 3న బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక ట్రీట్ ఉండనుంది. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన ‘గోలియోన్ కీ రాస్‌లీలా రామ్-లీలా’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

Advertisement

నవంబర్ 4న ప్రముఖ బాక్సర్ ముహమ్మద్ అలీ జీవితంపై తెరకెక్కిన బయోగ్రాఫికల్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. అదే రోజు పోలిష్ మెడికల్ సిరీస్ ‘అనెస్థీషియా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. నవంబర్ 5న దీపావళి నేపథ్యంలోని ఫ్యామిలీ డ్రామా ‘దిల్వాలే దివాలీ’, స్పై థ్రిల్లర్ ‘బ్లాక్ డవ్స్ సీజన్ 2’, జపనీస్ రొమాంటిక్ కామెడీ ‘వన్ ఇయర్ టు లైవ్, బై ఎ మ్యాన్’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులను పలకరించనున్నాయి.

నవంబర్ 6 నుంచి 13 వరకు..

నవంబర్ 6న కొరియన్ రొమాంటిక్ మూవీ ‘పాసిబుల్ లవ్’, బెంగాలీ, తెలుగు భాషల్లో హారర్ థ్రిల్లర్ ‘కౌరిబురి: ది కర్స్డ్ టెంపుల్’నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నాయి. నవంబర్ 8న పిల్లల కోసం రూపొందించిన యానిమేటెడ్ మూవీ ‘మోటు పట్లూ అండ్ ది మిస్టరీ ఆఫ్ నాగమణి’ జియోహాట్‌స్టార్‌లో తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి రానుంది. నవంబర్ 9న యానిమేటెడ్ సిరీస్ ‘రాబిడ్స్ ఇన్వేషన్’ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 12న సాయి రోనక్ నటించిన తెలుగు కామెడీ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘పుష్పక విమానం’ జియోహాట్‌స్టార్‌లో, సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘ఇలాన్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నాయి.

నవంబర్ ఓటీటీ రిలీజ్‌ లిస్ట్

Advertisement

నవంబర్ 1
ది రెయిన్‌మేకర్ (The Rainmaker) – అమెరికన్ కోర్ట్‌రూమ్ డ్రామా సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
ది పెలికాన్ బ్రీఫ్ (The Pelican Brief) – డ్రామా మూవీ – నెట్‌ఫ్లిక్స్
జింగిల్ ఆల్ ది వే (Jingle All the Way) – ఫ్యామిలీ కామెడీ – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆల్ డాగ్స్ గో టు హెవెన్ (All Dogs Go to Heaven) – యానిమేటెడ్ మూవీ – అమెజాన్ ప్రైమ్ వీడియో

నవంబర్ 2
ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ (A Dog’s Perfect Christmas) – ఫ్యామిలీ మూవీ – నెట్‌ఫ్లిక్స్
మినియన్స్ అండ్ మాన్స్టర్స్ (Minions and Monsters) – అడ్వెంచర్ కామెడీ – జియోహాట్‌స్టార్

నవంబర్ 3
గోలియోన్ కీ రాస్‌లీలా రామ్-లీలా (Goliyon Ki Raasleela Ram-Leela) – రొమాంటిక్ డ్రామా – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 4
ది గ్రేటెస్ట్ (The Greatest) – ముహమ్మద్ అలీ బయోగ్రాఫికల్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
అనెస్థీషియా (Anesthesia) – పోలిష్ మెడికల్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 5
దిల్వాలే దివాలీ (Dilwale Diwali) – హిందీ ఫ్యామిలీ డ్రామా – నెట్‌ఫ్లిక్స్
బ్లాక్ డవ్స్ సీజన్ 2 (Black Doves Season 2) – స్పై థ్రిల్లర్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
వన్ ఇయర్ టు లైవ్, బై ఎ మ్యాన్ (One Year to Live, by a Man) – జపనీస్ రొమాంటిక్ కామెడీ – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 6
పాసిబుల్ లవ్ (Possible Love) – కొరియన్ రొమాంటిక్ మూవీ – నెట్‌ఫ్లిక్స్
కౌరిబురి: ది కర్స్డ్ టెంపుల్ (Kauriburi: The Cursed Temple) – బెంగాలీ, తెలుగు హారర్ థ్రిల్లర్ – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 8
మోటు పట్లూ అండ్ ది మిస్టరీ ఆఫ్ నాగమణి (Motu Patlu and the Mystery of Nagamani) – యానిమేటెడ్ మూవీ – జియోహాట్‌స్టార్

నవంబర్ 9
రాబిడ్స్ ఇన్వేషన్ (Rabbids Invasion) – యానిమేటెడ్ సిరీస్ – జియోహాట్‌స్టార్

నవంబర్ 11
రాక్ ఆన్ (Rock On) – మ్యూజికల్ డ్రామా – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 12
పుష్పక విమానం (Pushpaka Vimana) – తెలుగు కామెడీ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ – జియోహాట్‌స్టార్
ఇలాన్ (Elan) – సైన్స్ ఫిక్షన్ కామెడీ – నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 13
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ – ఆఫ్టర్ ది డార్క్ (Student of the Year – After the Dark) – థ్రిల్లర్ సిరీస్ – జియోహాట్‌స్టార్
పరివారిక్ మనురంజన్ (Parivarik Manuranjan) – రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ – సోనీలివ్

నవంబర్ 16
క్వీన్స్ (Queens) – హిందీ డ్రామా సిరీస్ – జియోహాట్‌స్టార్

నవంబర్ 18
మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ (Mr. and Mrs. Office) – తమిళ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ కామెడీ – జియోహాట్‌స్టార్
మాడెన్ (Madden) – జాన్ మాడెన్ బయోపిక్ – అమెజాన్ ప్రైమ్ వీడియో

నవంబర్ 20
దే విల్ కిల్ యు (They Will Kill You) – యాక్షన్ హారర్ మూవీ – అమెజాన్ ప్రైమ్ వీడియో

నవంబర్ 25
బ్లేడ్ రన్నర్ 2099 (Blade Runner 2099) – డిస్టోపియన్ సైబర్‌పంక్ సీక్వెల్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
నైన్ టు సిక్స్ (Nine to Six) – ఆఫీస్ డ్రామా సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
వే ఆఫ్ ది వారియర్ కిడ్ (Way of the Warrior Kid) – ఫ్యామిలీ మూవీ – ఆపిల్ టీవీ ప్లస్

నవంబర్ 30
ది బాయ్ హూ స్టోల్ బిలియన్స్? (The Boy Who Stole Billions?) – క్రైమ్ డాక్యుసిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో

Read Also: మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

Tags

Related News

ఏలకుల తోటలో అర్ధరాత్రి దుండగుల దాడి… భర్తను కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం… మైండ్ బ్లాక్ చేసే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్‌

నెట్ ఫ్లిక్స్ పొరపాటు.. లీక్ అయిన రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్!

ఓటీటీలో జైలర్ 2 డబుల్ ట్రీట్.. కొత్త సీన్స్ యాడ్!

పసిపాప మాస్క్‌ వేసుకున్న సైకో కిల్లర్‌… కల్లో కనిపించిన కిల్లర్ నిజమైతే… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్

పిచ్చి పట్టి చచ్చే ఫ్యామిలీ… ఎక్స్ లవర్ ఉసురు తగిలి నాశనం… ఒళ్లు గగుర్పొడిచే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

వైరస్‌ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×