Crime Comedy Thriller: మన ఫోన్ కు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే పెద్దగా పట్టించుకోం. కానీ అదే అన్నోన్ కాల్ ఒక పెద్ద క్రైమ్ కేసుతో మనల్ని ముడిపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? అలాంటి కాల్ వల్ల అమాయకంగా కనిపించే నలుగురు యువకులు ఓ కిడ్నాప్ కేసులో ప్రధాన అనుమానితులుగా మారతారు. ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘కోల్డ్ కాల్’ (Cold Call). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అసలు స్టోరీ ఏంటి ? అనేది తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి.
2023 శీతాకాలంలో బెంగళూరు నగరంలో ఓ వ్యాపారవేత్తకు చెందిన 13 ఏళ్ల కుమారుడు కిడ్నాప్‌కు గురవుతాడు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తుంది. చిన్న పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు చేశారు ? అతన్ని ఎక్కడ దాచారు ? అనే ప్రశ్నలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ కిడ్నాప్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అయితే దర్యాప్తులో ఊహించని విషయం బయటపడుతుంది. మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్స్ గా పని చేసే నలుగురు యువకులు ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా మారతారు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, కేసుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో అనుమానాలు మరింత పెరుగుతాయి.
కథలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… అయితే ఆ సంఘటనను అందరూ ఒకే విధంగా చూడరు. ఒకొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా మీడియా ఆ విషయాన్ని ఇంకా పెద్దది చేస్తుంది. ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంటే, మరోవైపు గతంలో జరిగిన సంఘటనలు, ప్రస్తుత పరిస్థితులు ఒకదానితో ఒకటి ముడిపడతాయి. మొదట చిన్నగా కనిపించిన విషయం కాస్తా పెద్ద క్రైమ్ మిస్టరీగా మారుతుంది. కిడ్నాప్ వెనుక అసలు కారణం ఏమిటి ? ఈ నలుగురిలో ఎవరికైనా నిజంగా సంబంధం ఉందా ? బయటకు కనిపిస్తున్న కథకు, వాస్తవంగా జరిగిన సంఘటనలకు మధ్య తేడా ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకు చూడాల్సిందే.
‘కోల్డ్ కాల్’ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. తంబిదురై ఎదురాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అక్టోబర్ 30 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ భాషలో, హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉంది. కిడ్నాప్ మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్‌తో పాటు కామెడీ అంశాలు కలిసిన సినిమాలను ఇష్టపడేవారు ఈ మూవీని డోంట్ మిస్. తంబిదురై ఎదురాజ్ (Thambidurai Ethuraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లోకి వచ్చింది.
Read Also: మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా