E-Paper
Advertisement

రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌
Advertisement

Heist Thriller Movie OTT : హాలీవుడ్ హీస్ట్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పక్కా ప్లానింగ్, అడ్వాన్స్‌డ్ గ్యాడ్జెట్స్, లాస్ట్ మినిట్ ట్విస్ట్‌లతో సాగే ఇలాంటి సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ జాన్ ట్రావోల్టా (John Travolta) లీడ్ రోల్‌లో వచ్చిన అలాంటి ఒక హై-వోల్టేజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే ‘ది జెంటిల్‌మన్ థీఫ్’ (The Gentleman Thief). ‘క్యాష్ అవుట్’ (Cash Out), ‘హై రోలర్స్’ (High Rollers) సినిమాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో మూడో మూవీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే…

మేసన్ గాడార్డ్ ఒకప్పుడు వరల్డ్ క్లాస్ మాస్టర్ థీఫ్. ప్రస్తుతం ఆ క్రైమ్ లైఫ్ మొత్తానికి గుడ్ బై చెప్పేసి, ప్రశాంతంగా ఒక గోల్ఫ్ కోర్స్ నడుపుకుంటూ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ అతని తమ్ముడు షాన్ ఒక భారీ లూటీ ప్లాన్‌ తో అన్న దగ్గరకు వస్తాడు. మయామిలో జరిగే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఆక్షన్ కోసం తీసుకొచ్చిన 100 మిలియన్ డాలర్ల విలువైన అత్యంత అరుదైన పెయింటింగ్‌ను ఓ లగ్జరీ యాచ్ నుంచి దొంగిలించడమే ప్లాన్. మొదట ఈ దోపిడీకి ఒప్పుకోకపోయినా, చివరకు మేసన్ తన పాత టీమ్‌ను మళ్లీ రంగంలోకి దించుతాడు.

Advertisement

అంతా పక్కాగా జరుగుతుంది అనుకున్న హీస్ట్ ప్లాన్‌ లో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. యాచ్‌ లో దోపిడీ జరుగుతున్న సమయంలో పరిస్థితి అదుపు తప్పుతుంది. మేసన్ పాత శత్రువు, క్రిమినల్ కింగ్‌పిన్ సలాజర్ పన్నిన ఉచ్చులో టీమ్ చిక్కుకుంటుంది. యాచ్‌లో మంటలు చెలరేగడంతో మేసన్, అతని టీమ్ చనిపోయారని అందరూ భావిస్తారు. కానీ మేసన్ మాత్రం అంతటితో ఆగడు. తన మాజీ ప్రేయసి ఒడెస్సా సహాయంతో సలాజర్ సామ్రాజ్యంలోకి చొరబడి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. మరి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మేసన్ ఎలా బయటపడ్డాడు ? తన టీమ్‌ను కాపాడుకుంటూ జీవితంలోనే అత్యంత కష్టమైన హీస్ట్‌ ను ఎలా పూర్తి చేశాడనేదే సినిమాలో చూడాల్సిన మిగతా కథ.

Also Read : మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

ఏ ఓటీటీలో అందుబాటులో ?

Advertisement

జాన్ ట్రావోల్టా (John Travolta), లుకాస్ హాస్ (Lukas Haas), రెబెక్కా డి మోర్నే (Rebecca De Mornay), సామ్ అస్గారి (Sam Asghari) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాండల్ ఎమ్మెట్ (Randall Emmett) దర్శకత్వం వహించారు. ‘ది జెంటిల్‌మన్ థీఫ్’ ప్రస్తుతం హులు (Hulu)లో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. లగ్జరీ యాచ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే దొంగతనం సీన్లు, మయామి యాక్షన్ సీక్వెన్సులు చాలా రిచ్‌గా ఉంటాయి. కథలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ, హీస్ట్ ప్లానింగ్, యాక్షన్, మైండ్ గేమ్స్ అదిరిపోతాయి. పాపులర్ సెలబ్రిటీలు డీజే ఖలీద్ (DJ Khaled), క్వావో (Quavo) కూడా ఈ సినిమాలో కనిపించడం విశేషం. భారీ ట్విస్టులతో సాగే థ్రిల్లర్ కాకపోయినా, మంచి టైమ్ పాస్ కోసం ఒకసారి చూడొచ్చు.

Tags

Related News

పిచ్చి పట్టి చచ్చే ఫ్యామిలీ… ఎక్స్ లవర్ ఉసురు తగిలి నాశనం… ఒళ్లు గగుర్పొడిచే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

వైరస్‌ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

Big Stories

Advertisement
×