E-Paper
Advertisement

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ
Advertisement

Korean Psychological Mystery Series: కొరియన్ డ్రామాల్లో ప్రేమకథలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సైకలాజికల్ మిస్టరీలకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా చెప్పడం, అందులో ఎవరు నిజం చెబుతున్నారో చివరి వరకు అర్థం కాకుండా కథను నడిపించడం ఈ జానర్‌లో ఆసక్తిని పెంచుతుంది. అలాంటి డిఫరెంట్ కథాంశంతో వచ్చిన కొరియన్ సిరీసే ‘ది పర్ఫెక్ట్ లై’ (The Perfect Lie). ఓ డేట్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు వింతగా ఆరోపణలు చేసుకుంటారు. ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనే ఉత్కంఠతో ఈ సైకలాజికల్ మిస్టరీ కథ నడుస్తుంది. ఇంతకీ ఈ ఇంట్రస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? అంటే…

కథలోకి వెళ్తే…

మిన్ జూన్-హో ఒక ప్రముఖ కార్డియాక్ సర్జన్. వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్న అతను, భార్య మరణం తర్వాత తన కొడుకును ఒంటరిగా పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు కాంగ్ జీ-సన్ స్కూల్ టీచర్, లైబ్రేరియన్. ఇద్దరికీ పరిచయం ఏర్పడి దగ్గరవ్వగా, తరువాత కలిసి డేట్‌కు వెళ్తారు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. కానీ మరుసటి రోజు మాత్రం వారి జీవితాల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. డేట్ తర్వాతి రోజు జూన్-హో, జీ-సన్ ఇద్దరూ పోలీస్ స్టేషన్‌ కు చేరుకుంటారు. అయితే అక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ముందు రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంలో ఇద్దరూ పూర్తిగా డిఫరెంట్ విషయాలు చెబుతారు. ఒకే సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇద్దరికీ వేర్వేరుగా ఉండటంతో పోలీసులకు కూడా ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

ఒకరు చెప్పేది నిజమైతే మరొకరు చెప్పేది అబద్ధం కావాల్సిందే. కానీ ఇద్దరూ తమ వాదనకే కట్టుబడి ఉండటంతో కేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతను డిటెక్టివ్ లీ హ్వా-యంగ్ తీసుకుంటుంది. ఆమె ఇద్దరినీ విడివిడిగా విచారిస్తూ, ఆ రాత్రి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడంతో విచారణ ముందుకు సాగడం కష్టంగా మారుతుంది. దీంతో ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహిస్తారు. కానీ ఆ పరీక్ష ఫలితం కూడా కేసును ఒక కొలిక్కి తీసుకురాకపోగా, మిస్టరీని మరింత పెంచుతుంది.

ఇదిలా ఉంటే, జూన్-హో గతం కూడా ఈ కేసులో కీలకంగా మారుతుంది. అతని మరణించిన భార్యకు సంబంధించిన విషయాలు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మరోవైపు జీ-సన్ వ్యక్తిగత జీవితం, ఆమె కుటుంబ సంబంధాలు కూడా విచారణలో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఒక డేట్‌తో మొదలైన ఈ వ్యవహారం కాస్తా ఇద్దరి జీవితాల్లో దాచిపెట్టిన విషయాలను బయటపెట్టే పరిస్థితికి చేరుకుంటుంది. అసలు ఆ రాత్రి జరిగిన సంఘటన ఏమిటి? జూన్-హో చెప్పేది నిజమా, జీ-సన్ చెబుతున్నదే నిజమా? లై డిటెక్టర్ పరీక్షలో వచ్చిన ఫలితం వెనుక ఉన్న కారణమేంటి? అనే అంశాలతో ఒక్కో ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘ది పర్ఫెక్ట్ లై’ కొరియన్ సిరీస్. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొత్తం 12 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్‌కు జో యంగ్-మిన్ (Jo Young-min) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ కొరియన్ భాషలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. తెలుగు ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ సిరీస్‌లో మిన్ జూన్-హో పాత్రలో యూ యోన్-సియోక్ (Yoo Yeon-seok), కాంగ్ జీ-సన్ పాత్రలో సియో హ్యూన్-జిన్ (Seo Hyun-jin) నటించారు. డిటెక్టివ్ లీ హ్వా-యంగ్‌గా ఓక్ జా-యోన్ (Ok Ja-yeon) కనిపిస్తారు. వీరితో పాటు కిమ్ జీ-హ్యూన్ (Kim Ji-hyun), లీ చున్-హీ (Lee Chun-hee), ఇమ్ సాంగ్-జే (Im Seong-jae) తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read Also: వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Related News

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

ఏలకుల తోటలో అర్ధరాత్రి దుండగుల దాడి… భర్తను కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం… మైండ్ బ్లాక్ చేసే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్‌

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?

నెట్ ఫ్లిక్స్ పొరపాటు.. లీక్ అయిన రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్!

ఓటీటీలో జైలర్ 2 డబుల్ ట్రీట్.. కొత్త సీన్స్ యాడ్!

Big Stories

Advertisement
×