E-Paper
Advertisement

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’
Advertisement

Comrade Kalyan Movie OTT: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరోల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) ఒకరు. కామెడీతో పాటు కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు శ్రీవిష్ణు అటెంప్ట్ చేసిన అలాంటి మరొ విభిన్నమైన సినిమానే ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). 1990ల నాటి ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, పోలీసుల ఆపరేషన్లు, రాజకీయ సంఘర్షణలతో పాటు కడుపుబ్బా నవ్వించే సంఘటనలు కూడా ఉంటాయి. మరి ఈ కామెడీ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1994లో మాడుగుల ప్రాంతంలో మొదలవుతుంది. తాడికొండ కళ్యాణ్ అనే యువకుడు ఓ పాత సినిమా థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. పెద్దగా చదువుకోని కళ్యాణ్‌కు జీవితంలో పెద్దగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన ఉండదు. తనదైన స్టైల్‌లో సరదాగా గడుపుతూ, స్నేహితులతో తిరుగుతుంటాడు. అయితే అతనికి ఒక పెద్ద కల ఉంటుంది. ప్రస్తుతం లీజుకు తీసుకుని నడుపుతున్న థియేటర్‌ను ఎప్పటికైనా సొంతం చేసుకోవాలి. కానీ అతని తల్లి సరస్వతమ్మ చేసే పనులు తరచూ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగే గొడవల్లో ఆమె జోక్యం చేసుకోవడంతో కళ్యాణ్‌కు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ జీవితంలోకి సితారాదేవి అనే ఒడిశా యువతి వస్తుంది. మొదట భాషా సమస్య కారణంగా ఆమెతో మాట్లాడటానికి కళ్యాణ్ కొంత ఇబ్బంది పడినా, ఆ తర్వాత ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. అయితే సితార కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుంటాడు. ఆమె తల్లి సరస్వతమ్మకు ఆరోగ్య సమస్య ఎదురైన సమయంలో కళ్యాణ్ సహాయం చేస్తుంది. దీంతో ఆ కుటుంబంతో అతనికి మరింత దగ్గర పరిచయం ఏర్పడుతుంది. సితార కుటుంబానికి బిస్వాస్ అనే ఫైనాన్షియర్ నుంచి ఒత్తిడి ఎదురవుతుంటుంది. అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న సితారను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అతడు. దీంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని ఈ సమస్యల నుంచి బయటపడేయాలని కళ్యాణ్ నిర్ణయించుకుంటాడు.

అనుకున్నంత సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యం కాకపోవడంతో కళ్యాణ్ తన స్నేహితుడు దుబాయ్ బాబు సహాయం తీసుకుంటాడు. సితార కుటుంబానికి అవసరమైన డబ్బు సమకూర్చే ప్రయత్నంలో ఇద్దరూ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ పోలీసుల దృష్టిలో ఒక ప్రమాదకరమైన నక్సలైట్ నాయకుడిగా మారిపోతాడు. ఈ గందరగోళం నుంచి కళ్యాణ్ ఎలా బయటపడ్డాడు ? సితార కుటుంబాన్ని కాపాడగలిగాడా ? అతని థియేటర్ కల నెరవేరిందా ? జార్జ్ కుట్టి ఆపరేషన్ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాగా, అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ కామెడీ సినిమాలో కళ్యాణ్‌గా శ్రీవిష్ణు, సితారగా మహిమా నంబియార్ (Mahima Nambiar) నటించారు. కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ పాత్రలో రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar), జార్జ్ కుట్టిగా షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కనిపిస్తారు. దుబాయ్ బాబు పాత్రలో సత్య (Satya) తన కామెడీతో అలరిస్తారు.

Read Also: స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

Related News

తెలియని నంబర్ నుంచి ఆ ఫోన్ కాల్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో అలరించే తమిళ్ క్రైమ్ కామెడీ

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

ఏలకుల తోటలో అర్ధరాత్రి దుండగుల దాడి… భర్తను కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం… మైండ్ బ్లాక్ చేసే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్‌

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?

నెట్ ఫ్లిక్స్ పొరపాటు.. లీక్ అయిన రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్!

Big Stories

Advertisement
×