BigTV English
Advertisement

OTT Movie : కొడుకు కోసం పడరాని పాట్లు… బట్టలు లేకుండా ఆ పని చేస్తూ…

OTT Movie : కొడుకు కోసం పడరాని పాట్లు… బట్టలు లేకుండా ఆ పని చేస్తూ…

OTT Movie : ఓటిటి లో కొత్త కొత్త స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భర్త పనికిమాలినవాడు కావడంతో, భార్య కొడుకు కోసం ఒక కొత్త ఉద్యోగం వెతుక్కుంటుంది. ఆ ఉద్యోగంతో ఎదుటి వాళ్ళ దగ్గర బట్టలు లేకుండా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె స్టోరీ ఎలా తిరుగుతుందనేది ఈ మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మరాఠీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….


జీ 5 (Zee 5) లో 

ఈ మరాఠీ మూవీ పేరు ‘న్యూడ్’ (Nude). 2018 లో వచ్చిన ఈ మూవీకి రవి జాధవ్ దర్శకత్వం వహించారు. రవి జాధవ్, జీ స్టూడియోస్ కలసి దీనిని నిర్మించారు. ఈ చిత్రం కళాశాలలో నగ్న మోడల్‌గా పనిచేసే ఒక తల్లి చుట్టూ తరుగుతుంది. జీ 5 (Zee 5) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

యమున ఒక పేద కుటుంబం నుంచి వస్తుంది. ఆమె తన భర్త, కొడుకు లక్ష్మణ్ తోకలసి ఒక గ్రామంలో నివసిస్తుంది. ఆమె భర్త మరొక స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉంటాడు. యమున ఆదాయాన్ని ఆ స్త్రీ కోసం ఖర్చు చేస్తుంటాడు ఆమె భర్త . ఒక రోజు ఇదే విషయంపై ఇద్దరికీ గొడవ జరుగుతుంది. భర్త చేతిలో ఆమె దారుణంగా అవమానించబడిన తర్వాత, యమున తన కొడుకుతో కలిసి ముంబైకి వెళ్లిపోతుంది. తన అత్త చంద్రక్క వద్ద ఆశ్రయం పొందుతుంది. చంద్రక్క కూడా పేదరికంలో జీవిస్తూ, ఒక చిన్న గదిలో తన భర్తతో నివసిస్తుంది. ఇక యమున తన అత్తపై భారం కాకూడదని, ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఒక రోజు, చంద్రక్క ఏ పని చేస్తుందో తెలుసుకోవడానికి ఆమెను అనుసరించి, సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌కు చేరుకుంటుంది. అక్కడ చంద్రక్క కొన్ని సంవత్సరాలుగా కళాశాలలో నగ్న మోడల్‌గా పనిచేస్తోందని తెలుసుకంటుంది. ఇది పొట్టకూటి కోసం చేసే గౌరవనీయమైన పని అని ఆమె అత్త చెప్తుంది. మొదట సంకోచించిన యమున, తన కొడుకు విద్య కోసం డబ్బు సంపాదించడానికి ఈ పనిని స్వీకరిస్తుంది. ఆమె నగ్న మోడల్‌గా పనిచేయడం ప్రారంభించి, అదనపు ఆదాయం కోసం ఇంటి పనులు కూడా చేస్తుంది.

యమున తన పనిని రహస్యంగా ఉంచుతుంది. ఎందుకంటే సమాజం దీనిని అసభ్యంగా భావిస్తుందని అనుకుంటుంది. కళాశాలలో ఒక విద్యార్థి మాత్రమే ఆమెపై శ్రద్ధ చూపిస్తాడు. మిగిలిన వారు ఆమె ఉనికిని పట్టించుకోరు. యమున తన కొడుకు కళల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడని తెలుసుకుంటుంది. కానీ ఆమెకి ఎప్పుడైనా ఈ రహస్యం తన కొడుక్కి తెలిసిపోతుందేమో అనే భయం ఉంది. అందుకని వారు అతన్ని ఔరంగాబాద్‌లోని బంధువుల వద్దకు విద్య కోసం పంపిస్తారు. లక్ష్మణ్ తనచదువు కోసం నిరంతరం డబ్బు డిమాండ్ చేస్తాడు. దీంతో యమున కళాశాల బయట ప్రైవేట్ అసైన్‌మెంట్‌లను కూడా స్వీకరిస్తుంది. ఒక రోజు ప్రఖ్యాత కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ ముంబైకి వస్తాడు. యమున అతని కోసం నగ్నంగా పోజ్ ఇస్తుంది. అయితే ఈ నగ్న చిత్రాలపై హింసాత్మక నిరసనలు చెలరేగుతాయి. కళాశాలపై దాడి కూడా జరుగుతుంది. అక్కడ గీసిన చిత్రాలు ధ్వంసం చేయబడతాయి. ఒక రోజు లక్ష్మణ్ ఇంటికి వచ్చి, యమునను వేశ్య అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. చివరికి యమున ఎటువంటి నిర్ణయం తెసుకుంటుంది ? తన వృత్తిని అలాగే కొనసాగిస్తుందా ? ఈ విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also : టీచర్ కోరికను ఎప్పుడు పడితే అప్పుడు తీర్చే స్టూడెంట్ … పెద్దలు మాత్రమే చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్

Tags

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×