BigTV English

Elon Musk: ఎలాన్ మస్క్ సీక్రెట్ ప్లాన్ లీక్.. పిల్లలను కనేందుకు.. ఏం చేశాడో తెలిస్తే..

Elon Musk: ఎలాన్ మస్క్ సీక్రెట్ ప్లాన్ లీక్.. పిల్లలను కనేందుకు.. ఏం చేశాడో తెలిస్తే..

Elon Musk: స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు, అపర మేధావి మాత్రమే కాదు. అంతకుమించిన రసికుడు కూడా. ఇది.. మస్క్ గురించి కొందరికే తెలిసిన మరో కోణం. అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సంతానం విషయంలో అతని ఆలోచనలు ఎక్కడిదాకా వెళ్లిపోయాయో.. ఒక్క రిపోర్ట్ బయటపెట్టేసింది. అందులో ఉన్న విషయాలు చూశాక.. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. అదేంటో తెలిస్తే.. మీ మైండ్ కూడా బ్లాంక్ అవడం ఖాయం.


ఆలోచనల బౌండరీలను దాటి ఆలోచించే మస్క్

ఈ ప్రపంచం మొత్తం ఓ వైపు తిరిగి ఆలోచిస్తుంటే.. దానికి పూర్తి వ్యతిరేకమైన దిశలో నిలబడి ఆలోచించేవాడే ఎలాన్ మస్క్. మనిషి ఆలోచనల బౌండరీలను దాటి ఆలోచిస్తాడు అతను. అందుకే.. ఓ టెస్లా వచ్చింది. ఓ స్పేస్ ఎక్స్ వచ్చింది. న్యూరాలింక్, హ్యుమనాయిడ్ రోబోలు, హైపర్‌లూప్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఉన్నాయ్. కాసేపు ఇవన్నీ పక్కనబెడితే.. సంతానం విషయంలోనూ ఎలాన్ మస్క్ ఆలోచనలు శిఖరాన్ని తాకుతున్నాయ్. ఈ భూమిపై మనుషులున్న ప్రతి చోటా.. తన పిల్లలు ఉండాలనుకుంటున్నాడు ఎలాన్ మస్క్. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే.. అప్పుడే ఆశ్చర్యపోకండి. మీకు తెలియాల్సిన స్టోరీ చాలానే ఉంది.


కోరికలు.. స్పేస్ ఎక్స్ కారట్లైతే?

కోరికలు గుర్రాలైతే.. ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అవే కోరికలు.. స్పేస్ ఎక్స్ రాకెట్లైతే? ఎట్లా ఉంటుందో చూపించేందుకు సిద్ధమయ్యాడు ఎలాన్ మస్క్. ఎవరైనా ఒకరిద్దరు పిల్లల్ని కనాలనుకుంటారు. ఇప్పుడున్న రోజుల్లో.. ఒక్కరే చాలనుకుంటున్నారు. కొందరైతే.. అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. అదే.. ఎలాన్ మస్క్ మాత్రం.. ఈ మొత్త ప్రపంచంలోని మగాళ్ల కంటే భిన్నంగా ఆలోచించాడు. పిల్లల విషయంలో అతని ఆలోచన.. ఈ ప్రపంచం ఊహకు కూడా అందని విధంగా ఉంది. ఎవరైనా.. మాటవరసకు గంపెడు పిల్లల్ని కనాలనుకుంటున్నాం అని చెబుతారు. మరీ.. పిల్లల మీద ప్రేమ ఎక్కువైతే.. డజను మందిని కంటాం అంటుంటారు.

గంపెడు, డజన్లు కాదు.! గుంపునే కనాలనుకుంటున్న మస్క్

కానీ.. మస్క్ గంపెడు, డజన్లు కాదు. ఏకంగా ఓ గుంపునే కనాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలోని ప్రతి చోట తన పిల్లలు ఉండాలనే ఆలోచనతో ఉన్నాడు. అసలేంటి.. మస్క్ లెక్క? దేనికోసం.. వేల మంది పిల్లలకు తండ్రి అవ్వాలనుకుంటున్నాడు? ఇదే.. డౌట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు కూడా వచ్చింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి.. ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో.. సంచలన విషయాలు బయటపడ్డాయ్.

పిల్లల్ని లీజియన్‌ని నిర్మించాలనుకుంటున్న ఎలాన్ మస్క్

టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ పిల్లల లీజియన్‌ని నిర్మించాలనుకుంటున్నాడట. లీజియన్ అనేది.. ఒకప్పటి రోమన్ సైన్యంలో ఓ పెద్ద యూనిట్‌ని సూచిస్తుంది. సాధారణంగా ఒక లీజియన్‌లో 3 వేల నుంచి 6 వేల మంది సైనికులు ఉంటారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా తన పిల్లలతో ఓ లీజియన్‌ని నిర్మించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం.. తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌ని గట్టిగా వాడేస్తున్నాడు. దాని ద్వారానే.. మహిళలను సంప్రదిస్తున్నాడు. సరోగసి ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రయత్నాలను వేగవంతం చేశాడు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, కఠినమైన డిస్‌క్లోజర్ అగ్రిమెంట్లతో.. తన పిల్లల కోసం తల్లుల్ని నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయ్.

ఇప్పటివరకు 14 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్

ఇప్పటివరకు మస్క్.. నలుగురు భాగస్వాములతో 14 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇందులో.. అతని మాజీ భార్య జస్టిన్ విల్సన్, సింగర్ గ్రిమ్స్, న్యూరాలింక్ డైరెక్టర్ శివోన్ జిలిస్, రైటర్ ఆష్లే సెయింట్ క్లెయిర్ ఉన్నారు. మస్క్ సన్నిహిత వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. అతనికి ఇంకా చాలా మంది మహిళలతో.. ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉండొచ్చని తెలుస్తోంది. న్యూరాలింక్ డైరెక్టర్‌గా ఉన్న శివోన్ జిలిస్‌తోనే.. మస్క్ నలుగురి పిల్లల్ని కన్నాడు. దాంతో.. ఆమె మిగతా తల్లుల్లో స్పెషల్ స్టేటస్ కలిగి ఉన్నట్లుగా చెబుతున్నారు. వీళ్లే కాదు.. ఇటీవలే జపాన్‌కి చెందిన ఓ హై-ప్రొఫైల్ మహిళకు.. ఎలాన్ మస్క్ తన వీర్యాన్ని కూడా ఇచ్చాడని.. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌లో తేలింది.

మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చిన ఆష్లే సెయింట్ క్లెయిర్

గత సెప్టెంబర్‌లో 26 ఏళ్ల ఆష్లే సెయింట్ క్లెయిర్.. మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చింది. వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలనే తన కోరిక గురించి.. మస్క్ నుంచి తనకు అనేక సందేశాలు వచ్చాయని ఆమె బయటపెట్టింది. అంతేకాదు.. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా మస్క్ చెప్పినట్లు తెలిపింది. ఈ ప్రపంచం అంతమయ్యేనాటి కంటే ముందే.. లీజియన్ స్థాయికి చేరుకునేందుకు సరోగేట్స్‌ని ఉపయోగించాలనే ఆలోచనతో ఎలాన్ మస్క్ ఉన్నాడని.. ఆష్లే తెలిపింది. ఆ దిశగా.. మహిళల్ని సంప్రదిస్తూ.. సరోగేట్స్‌ని సిద్ధం చేస్తూ.. ఎలాన్ మస్క్ టీమ్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతోంది.

వేలాదా సంతానంపై మస్క్ లెక్కేంటి?

ఎక్కువ మంది పిల్లల్ని కనడంలో ఎలాన్ మస్క్‌కు ఉన్న ఆలోచనల్ని బయటపెట్టి.. వాల్ స్ట్రీట్ జర్నల్ పేల్చిన బాంబ్ ప్రపంచం మొత్తం రీసౌండ్ వచ్చింది. కానీ.. మస్క్ కంటే ముందే.. ఒకడు ఇలా ఆలోచించాడని తెలుసా? శతాబ్దాల క్రితమే.. మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చంఘీజ్ ఖాన్ ఈ ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మంది తన సంతానం ఉండాలనుకున్నాడు. అతని డీఎన్ఏ మూలాలున్న వాళ్లు.. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారంటే నమ్ముతారా?

పిల్లల్ని కనడం ఎలాన్ మస్క్‌కి ఓ మిషన్

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ.. పిల్లల్ని కనడం మామూలు విషయమే. కానీ.. ఎలాన్ మస్క్‌కి అలా కాదు. అదో.. మిషన్. అందుకోసమే.. అన్ని దేశాల్లోనూ తన సంతానం ఉండాలనుకుంటున్నాడు. అందుకు.. అనేక కారణాలున్నాయ్. అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది. మస్క్‌కి ఇలాంటి ఆలోచన కొన్నేళ్ల క్రితమే వచ్చి ఉండొచ్చు. కానీ.. ఇదే ఆలోచన శతాబ్దాల క్రితమే మంగోల్ సామ్రాజ్యాధినేత చంఘీజ్ ఖాన్‌కు వచ్చింది. అతను కూడా అప్పుడు ఇలాగే ఆలోచించాడు. ఆచరణలో పెట్టాడు. ఇప్పటికీ.. చంఘీజ్ ఖాన్‌కు వై-క్రోమోజోమ్ లైనేజ్‌ కలిగిన వాళ్లు కోట్లల్లో ఉన్నారు.

మహిళలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్న మస్క్

ప్రస్తుతం సుమారుగా 20 మిలియన్ల మగాళ్లు.. చంఘీజ్ ఖాన్ వై-క్రోమోజోమ్ లైనైజ్ కలిగి ఉండొచ్చనే అంచనాలున్నాయ్. ఇది కేవలం.. మేల్ లైన్ వారసత్వానికి సంబంధించిన డేటా మాత్రమే. ఇక.. స్త్రీల ద్వారా వచ్చిన వారసులను అంచనా వేయడం కష్టం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా గుట్టుగా ఇదే పనిచేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం.. మహిళలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ.. వారి ద్వారా సరోగసీ విధానంలో వరుసపెట్టి పిల్లల్ని కనేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయ్.

సరోగేట్ మహిళలకు భారీగా డబ్బు చెల్లింపు

మస్క్ టీమ్.. చాలా మంది సరోగేట్ మహిళల్ని సంప్రదిస్తోంది. వాళ్లందరినీ తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు భారీగా డబ్బు చెల్లిస్తోంది. వారితో.. కఠినమైన డిస్‌క్లోజర్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటోంది. మస్క్‌కి అత్యంత సన్నిహితుడైన జారెడ్ బిర్చలే.. ఈ కిడ్స్ లీజియన్ వ్యవహారాల్ని చూసుకుంటున్నాడు. మస్క్ టీమ్ దీనిని.. మెరిటోక్రసీగా పిలుస్తోందని చెబుతున్నారు. అంటే.. ప్రజలు ఎంత బాగా పనిచేస్తే.. అంత మంచి ప్రయోజనాలు దక్కుతాయని అర్థం. మస్క్ స్పెర్మ్ ద్వారా పిల్లల్ని కనే మహిళలు.. బర్త్ సర్టిఫికెట్‌లో అతని పేరు తొలగించాల్సి ఉంటుంది. ఆ పిల్లలకు అతనే తండ్రి అని బయటకు చెప్పకుండా ఉండేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాన్ మస్క్‌ 13వ బిడ్డకు జన్మనిచ్చిన ఆష్లే సెయింట్ క్లెయిర్‌కి కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చారు. బర్త్ సర్టిఫికెట్‌లో మస్క్ పేరుని తొలగించి..

మస్కే తండ్రి అని బయటకు చెప్పకుండా ఒప్పందాలు

ఆ పిల్లలకు అతనే తండ్రి అని చెప్పకుండా ఉండేందుకు.. ఆష్లేకు మొదట 15 మిలియన్ డాలర్లు ఆఫర్ చేశారు. దాంతో పాటు నెలకు లక్ష డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అయితే.. సెయింట్ క్లెయిర్ తన బిడ్డకు తండ్రెవరనే విషయాన్ని దాచిపెట్టాలనుకోలేదు. మస్క్ నుంచి వచ్చిన ఆఫర్‌ని ఆమె యాక్సెప్ట్ చేయలేదు. అయినా.. బర్త్ సర్టిఫికెట్ నుంచి మస్క్ పేరు మాయమైపోయింది. ఫిబ్రవరిలో ఆమె తమ సంబంధం గురించి బహిరంగంగా చెప్పాక.. ఆమెకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 40 వేల డాలర్లకు తగ్గించారు. ప్రస్తుతం.. 20 వేల డాలర్లు మాత్రమే ఇస్తున్నారు.

జపాన్‌కి క్రిప్టో ఇన్‌ప్లుయెన్సర్ ఫనీని సంప్రదించిన మస్క్

వాల్ స్ట్రీట్ రిపోర్ట్ ప్రకారం.. ఎలాన్ మస్క్ జపాన్‌కి చెందిన క్రిప్టో కరెన్సీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్‌ని కూడా తన బిడ్డను కనమని నేరుగా సంప్రదించారు. కానీ.. ఆమె మస్క్ ప్రతిపాదనని తిరస్కరించింది. ఎప్పుడైతే.. ఆష్లే సెయింట్ క్లెయిర్.. మస్క్ బిడ్డకు జన్మనిచ్చానని ప్రకటించిందో.. అప్పుడే టిఫనీ ఫాంగ్ మస్క్ తనతో చేసిన ప్రపోజల్‌ని బయపెట్టింది. మస్క్ పంపిన సందేశాలను పబ్లిక్ చేసింది. అతనికి ఈ విషయం తెలియగానే.. పరిణామాలు వేగంగా మారిపోయాయ్.

మస్క్ అన్‌ఫాలో చేయడంతో తగ్గిన టిఫనీ ఫాంగ్ ఫాలోవర్లు

మస్క్.. టిఫనీని అన్‌ఫాలో చేయడంతో.. ఆమె ఫాలోవర్లు కూడా భారీగా తగ్గిపోయారు. కేవలం టిఫనీ ఫాంగ్‌ని మాత్రమే కాదు.. పిల్లల లీజియన్‌ని సృష్టించేందుకు మస్క్ చాలా మంది మహిళల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనతో పిల్లల్ని కనాల్సిందిగా ఆఫర్ చేశాడని.. వాల్ స్ట్రీట్ జర్నల్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అయితే.. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై.. ఎలాన్ మస్క్ స్పందించాడు. అవన్నీ.. ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ.. మస్క్ తన పిల్లల లీజియన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలనే.. ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Also Read: ముక్కలు కానున్న పాకిస్థాన్! భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

తగ్గుతున్న జననాల రేటుపై మస్క్ ఆందోళన

మస్క్ మెదడులో ఈ రకమైన ఆలోచన పుట్టడం వెనుక ఓ థియరీ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో జననాల రేటు తగ్గడం వల్ల.. మానవాళి ప్రమాదంలో పడుతుందనే ఆలోచనని.. మస్క్ బలంగా నమ్ముతున్నారు. అందుకనే.. అతనిలో ఎక్కువమంది పిల్లల్ని కనాలనే కోరిక కలిగించే చర్చ సాగుతోంది. జనాభా పెరుగుదల ఆగిపోతే.. నాగరికత కుప్పకూలిపోతుందని.. ఎలాన్ మస్క్ తరచుగా చెబుతుంటారు. మానవాళి భవిష్యత్తుని సురక్షితంగా ఉంచేందుకు.. తెలివైన వ్యక్తులు ఎక్కువమంది పిల్లల్ని కనాలనే వాదనని మస్క్ గట్టిగా నమ్ముతారు.

నాగరికత అస్తిత్వానికే ప్రమాదం కలిగిస్తాయనే ఫీలింగ్

తగ్గుతున్న జననాల రేట్లు.. నాగరికత అస్తిత్వానికే ప్రమాదం కలిగిస్తాయనే ఫీలింగ్‌లో ఉన్నాడు మస్క్. అందుకోసమే.. ఈ గ్లోబ్ మొత్తం తన సంతానం ఉండాలని కోరుకుంటున్నాడు. దానికోసమే.. మహిళలను తన స్పెర్మ్ ఇస్తున్నాడు. సరోగేట్‌లను ఉపయోగిస్తున్నాడు. పిల్లల్ని కనేస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలను ప్రజల దృష్టికి దూరంగా ఉంచేందుకు.. మహిళలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాడని.. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ తేల్చింది. అయితే.. మస్క్ ఏం చేసినా.. చట్టపరమైన చర్యల ద్వారా అతనికున్న సంపద, పలుకుబడితో రక్షించబడుతున్నాడనే వాదనలున్నాయ్.

ఎంతటి రసికుడవో!

ఈ ప్రపంచం అంతమయ్యేనాటి కంటే ముందే.. లీజియన్ స్థాయి పిలల్ని కనేయాలనే ఆలోచనతో ఉన్నాడు ఎలాన్ మస్క్. ఇందుకోసం.. సరోగేట్ మహిళల్ని భారీ సంఖ్యలో ఉపయోగించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. మస్క్ టీమ్ కూడా మహిళల్ని సంప్రదిస్తూ.. డబ్బులు ఆఫర్ చేస్తూ.. సరోగేట్స్‌ని సిద్ధం చేస్తోంది. కానీ.. అతను అనుకుంటున్నట్లుగా వేల మంది పిల్లల్ని కంటాడా? లేదా? ఇప్పటికైతే.. సస్పెన్స్.

 

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×