E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

3,100 కోట్ల హర్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… చూడాలంటే భారీ మూల్యం

3,100 కోట్ల హర్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… చూడాలంటే భారీ మూల్యం
Advertisement

Supernatural Thriller: ఈ ఏడాది ‘ఆబ్సెషన్’ మూవీపై జరిగినంత చర్చ మరే సినిమా విషయంలోనూ జరగలేదనే చెప్పాలి. థియేటర్లలో ఉన్నప్పుడు వేల కోట్ల కలెక్షన్స్ తో దుమ్మురేపిన ఈ హర్రర్ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ మీద ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే ఆసక్తి మొదలైంది. కానీ అంతకంటే ముందు ఈ మూవీ స్ట్రీమింగ్ విషయం ఓటీటీ మూవీ లవర్స్ కు ఇబ్బందికరంగా మారింది. మరి ఇన్ని రోజులూ ఈ మూవీ ఓటీటీ విడుదల గురించి ఆతృతగా ఎదురు చూసిన ఆడియన్స్ ను ఇప్పుడు ఎదురైన నిరాశ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్

2026 సంవత్సరంలో హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession). కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌ తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అతిపెద్ద సక్సెస్‌ గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీలో PVOD (ప్రీమియం వీడియో-ఆన్-డిమాండ్) రూపంలో అందుబాటులో ఉంది. అంటే మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పటిదాకా ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి ఆశగా ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కంగుతిన్నారు. ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే అద్దెకు $19.99, కొనుగోలుకు $24.99 చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కాలేజీ కుర్రాడు బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) మన హీరో. అతను ఓ మ్యూజిక్ షాపులో పని చేస్తుంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండే నవరెట్టే) అంటే అతనికి ప్రాణం. కానీ ఆ విషయం ఆమెకు ధైర్యం చేసి చెప్పలేక లోలోపల బాధ పడుతుంటాడు. ఈ క్రమంలో ఒక మంత్రాల షాపులో “వన్ విష్ విల్లో” (One Wish Willow) అనే ఒక అతీంద్రియ శక్తి గల కర్ర ముక్కను కొనుక్కుంటాడు. నిక్కీ తనను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటూ దాన్ని విరగ్గొడతాడు.

ఆ మంత్రం అనుకున్నట్టుగానే పని చేస్తుంది. అనుకున్నది జరిగిందని మొదట్లో బేర్ చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే నిక్కీ ఒక్కసారిగా బేర్‌ తో విపరీతమైన ప్రేమలో పడిపోతుంది. ఆమె అతని చుట్టూ తిరుగుతూ, అతని ప్రతి కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నిక్కీ ప్రేమ కాస్తా ఒక క్రూరమైన, “అబ్సెషన్” అంటే అతి ప్రేమగా పిచ్చిగా మారుతుంది. ఆమె ప్రవర్తన వింతగా, భయంకరంగా తయారవుతుంది.

Advertisement

బేర్ పక్కన ఏ అమ్మాయి ఉన్నా ఆమె తట్టుకోలేకపోతుంది. నిక్కీ పిచ్చి ఎంత వరకు వెళ్తుందంటే బేర్ పట్ల ఆకర్షితురాలైన సారా అనే అమ్మాయిని నిక్కీ కిరాతకంగా చంపి, ఆమె చర్మాన్ని తలపై ధరించి బేర్ ముందుకు వస్తుంది. ఈ మాయను ఎలాగైనా ఆపాలని బేర్ ప్రయత్నిస్తాడు. కానీ తన ప్రాణాలు తీసుకుంటే తప్ప ఆ శాపం విడిపోదని తెలుసుకుంటాడు. భయాందోళనల మధ్య బేర్ గదిలోకి వెళ్లి మోతాదుకు మించి డ్రగ్స్ తిని ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.

సరిగ్గా అదే సమయంలో నిక్కీ బయట మరో ‘విల్లో’ కర్రను విరగ్గొట్టి బేర్ తనను ప్రేమించాలని కోరుకుంటుంది. మరి చావడానికి సిద్ధమైన హీరోని ఆ మంత్రం కాపాడిందా ? ఆ శాపం ఎలా తొలయిపోయింది ? స్పృహలోకి వచ్చాక హీరోయిన్ తన చుట్టూ పడి ఉన్న శవాలను చూసి ఏం చేసింది ? అన్నది తెలియాలంటే ఈ హర్రర్ మూవీని వీక్షించాల్సిందే. మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్టే, కూపర్ టోమ్లిన్‌సన్, మేగన్ లాలెస్, హేలీ ఫిట్జ్‌గెరాల్డ్, డారిన్ టూండర్, ఆండీ రిక్టర్ నటించిన ఈ చిత్రాన్ని హారర్ మూవీ ఫ్యాన్స్‌ డోంట్ మిస్.

Read Also : కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

Related News

నేరస్థులను లేపేసే అమాయకపు సైకో… కామెడీతో పాటు క్రైమ్ ఉన్న కొరియన్ సిరీస్

100 కోట్లకు పైగా వ్యూస్ తో దుమ్మురేపుతున్న తెలుగు డిజాస్టర్ మూవీ

షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్

కోట్లు కురిపించే షిప్పింగ్ యార్డ్ పై కన్ను… ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఓటీటీనే మోసం చేసిన డైరెక్టర్ కి భారీ షాక్.. !

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ వినోదం.. ఒక్కరోజే 10 కి పైగా స్ట్రీమింగ్..!

మనుషుల్ని పిశాచాలుగా మార్చే వైరస్… కొరియన్ అపోకలిప్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సిరీస్

Big Stories

×