E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది
Advertisement

Muhammad Furqan Bhatti On IND VS PAK :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) తర్వాత టీమిండియా వరుస సిరీస్ లతో దూసుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మొన్న ఐర్లాండ్ తో రెండు టీ20 సిరీస్ కూడా ఆడింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి బొక్క బోర్లా పడింది. ఆడిన రెండింటిలో ఓడిపోయి.. వైట్ వాష్ అయింది. అయితే కూడా ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మొన్ననే గెలిచి.. ఇప్పుడు పరువు తీసుకుందని టీమిండియాను ఎగతాళి చేస్తున్నారు. ఈ క్రమంలో మానిన ఆ గాయం పై పాకిస్తాన్ క్రికెట్ జర్నలిస్టు ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టి (Muhammad Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐర్లాండ్ త‌ర‌హాలోనే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచ‌న‌లు చేశారు. దీంతో ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టి (Muhammad Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమ్ ఇండియాను.. ఆ ప్లేయర్లకు ఉన్న బలుపు మొత్తాన్ని ఐర్లాండ్ దించిందని చురకలు అంటించారు. మేమే తోపులమని విర్రవీగుతున్న టీమిండియాను నేల నాకించేసారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఐర్లాండ్ తరహాలోని టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలని కోరారు. ఇకపైన టీమ్ ఇండియాతో జరిగే మ్యాచ్ లలో ఐర్లాండ్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి… మంచి విజయాలు సాధించాలని సూచనలు చేశారు. ఐర్లాండ్ తరహాలో ప్రదర్శన కనబరిస్తే ఏషియన్ గేమ్స్, ఆసియా కప్ టోర్నమెంటులో టీమిండియాను సులభంగా పాకిస్తాన్ ఓడిస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు వివరించారు.

బ‌లమైన టీమిండియాను ఓడించిన ఐర్లాండ్ ను ఆద‌ర్శంగా అంద‌రూ తీసుకోవాల‌ని కోరారు. అప్పుడే బీసీసీఐ త‌ల పొగ‌రు త‌గ్గుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అయితే పాకిస్తాన్ జర్నలిస్టు ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. కుర్ర క్రికెటర్లతో కూడిన టీమిండియా జట్టు ఐర్లాండ్ లో పర్యటించిందని.. అందుకే తమ జట్టు ఓడిపోయింది అని చెబుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగే టి20 సిరీస్ ను అదే కుర్ర క్రికెటర్లతో కొట్టబోతున్నట్లు చురకలు అంటిస్తున్నారు. ఐర్లాండ్ పైన కాదు ఇంగ్లాండు పైన కొట్టి చూపిస్తామని ముహమ్మద్ ఫుర్ఖాన్ భట్టికి ఛాలెంజ్ విసిరుతున్నారు.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

 

 

Related News

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Nida Dar: నన్ను చూస్తేనే టీమిండియా భ‌య‌ప‌డిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిప‌డేవారు

టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !

Tanveer Ahmed: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

Big Stories

×