OTT Releases October 15 : వారం మధ్యలోనే కొత్త సినిమాలు, సిరీస్లు చూసేందుకు ఎదురు చూస్తున్న వారి కోసమే ఓటీటీల్లో ఆసక్తికరమైన సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ప్రేమకథ నుంచి వైద్య రహస్యం వరకు, యువత స్నేహాల చుట్టూ తిరిగే కథ నుంచి ఎవరిని నమ్మాలో తెలియని రియాలిటీ గేమ్ వరకు విభిన్నమైన వినోదం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం రూపొందుతున్న రియాలిటీ షోతో పాటు, ఇతర భాషల్లో రూపొందిన సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. మరి మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
ముందుగా ఎన్న విలై (Enna Vilai) గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది. అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ షురూ అవుతుంది.
ఇక ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న మోస్ట్ అవైటింగ్ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ (The Traitors Telugu). తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అక్టోబర్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రారంభం కానుంది. ఇందులో 20 మంది ప్రముఖులు పాల్గొంటారు. పోటీదారుల్లో కొందరు నిజాయితీగా ఆట ఆడే వ్యక్తులుగా ఉంటే, మరికొందరు రహస్యంగా ఇతరులను మోసం చేసే పాత్రల్లో ఉంటారు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు తమ అసలు గుర్తింపును దాచిపెడుతున్నారు అనే విషయాన్ని కనిపెట్టడమే ఆటలో ప్రధాన సవాలు. అనుమానాలు, వ్యూహాలు, తాత్కాలిక మైత్రులు, నమ్మకద్రోహాలు పోటీని ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. విజేతకు కోటి రూపాయల బహుమతి లభించనుంది.
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (It’s a Medical Miracle) వైద్య నేపథ్యంతో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ ఓ యువకుడు, తన చుట్టూ జరుగుతున్న విషయాలను వినగలిగే స్థితిలో ఉండి. మళ్లీ బ్రతకడం కథలో కీలక అంశం. తనకు వినిపించిన స్వరంతో తన ప్రాణాలను కాపాడిన నర్సును వెతికే క్రమంలో అతడు రహస్యాలు, జ్ఞాపకాలు, ప్రతీకారంతో కూడిన ప్రమాదకరమైన వ్యవహారంలో చిక్కుకుంటాడు. ఈ చిత్రానికి శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహించగా, సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, అఖిలా భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మనోరమామ్యాక్స్, సింప్లీసౌత్లో తెలుగు ఆడియోతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Also Read : కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ
మరోవైపు యువత స్నేహాలు, వ్యక్తిగత సమస్యలు, నవ్వులు, భావోద్వేగాల చుట్టూ తిరిగే వెబ్సిరీస్ కప్పి స్క్వాడ్ (Kappi Squad). తమలోని అసంతృప్తులు, అహం, గుర్తింపు కోసం తపనతో ఇబ్బందులు పడే నలుగురు యువకులు కలిసి ఒక కేఫ్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఆ వ్యాపారం వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తుందా, లేక వారి మధ్య ఉన్న విభేదాలను మరింత పెంచుతుందా అన్నది కథలో ఆసక్తికరమైన అంశం. రినోష్ జార్జ్, అనఘ అజిత్, దియా దీపన్, జోయెల్ జోసెఫ్ తదితరులు ఇందులో నటించారు. ఈ సిరీస్ అక్టోబర్ 15న జియోహాట్స్టార్లో ప్రారంభం కానుంది. ఇది కూడా తెలుగుతో పాటు మిగతా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.