Railway Bonus: ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) చెల్లింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బోనస్ చెల్లింపుల కోసం కేంద్రం రూ.2,009.61 కోట్లు కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
అర్హులైన ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 బోనస్ ఇవ్వనున్నారు. దసరా, దుర్గా పూజ పండుగలకు ముందు ఏటా బోనస్ను కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లకు ఈ బోనస్ వర్తించనుంది. టెక్నీషియన్లు, పాయింట్స్మెన్, సూపర్వైజర్లు, ఇతర గ్రూప్-C ఉద్యోగులకూ సైతం ప్రయోజనం కలగనుంది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల పనితీరు అత్యుత్తమంగా ఉందని కేంద్రం వెల్లడించింది. దీంతో రికార్డు స్థాయిలో 1,670 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన రైల్వేలు 2025–26లో సుమారు 7.41 బిలియన్ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు రైల్వేలు చేర్చాయి. ఉద్యోగులను ప్రోత్సహించడం, రైల్వేల పనితీరును మరింత మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని కేంద్రం పేర్కోంది.
Also read: నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!