Bishnoi- Bumrah : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దిగ్వేష్ రతి స్టేడియంలో సంతకం చేసి ముంబై ఓపెనర్ రికెల్టన్ వికెట్ తీయడం ఓ ఆసక్తికర సన్నివేశం అయితే.. మరో ఆసక్తికర విశేషం ఏంటంటే..? రిషబ్ పంత్ ఈ సీజన్ లో ఈ మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శన చేయడంతో సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక ఇధిలా ఉంటే. ముంబౌ బౌలర్ బుమ్రా పరువు తీశాడు రవి బిష్ణోయ్. ఈ సమయంలో పంత్ రియాక్షన్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి.
Also Read : Video: రన్ ఔట్ చేయకుండా.. ఆ కుప్పిగంతులు ఏంట్రా
బుమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టిన బిష్ణోయ్ తాను సాధించినట్టుగా అర్థం వచ్చేలా సెలబ్రేట్ చేసుకున్నారు. డగౌట్ లోని లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లలో నవ్వులు విరిశాయి. వాస్తవానికి బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు కాస్త కష్టం అనే చెప్పవచ్చు. అలాంటి బౌలర్ అయిన బిష్ణోయ్ సిక్స్ కొట్టడంతో బుమ్రా సైతం నవ్వుతూ కనిపించారు. మరోవైపు బుమ్రా బౌలింగ్ లో రవి బిష్ణోయ్ సిక్స్ బాదడంతో పంత్ నవ్వుతూ రియాక్షన్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో రవి బిష్ణోయ్ 14 బంతుల్లో 13 పరుగులు చేశాడు. బోస్ బౌల్డ్ చేశాడు. కానీ బిష్ణోయ్ 2 సిక్స్ లు బాదడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 215 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 58, విల్ జాక్స్ 29, సూర్య కుమార్ యాదవ్ 54, నమన్ 25, బోస్ 20 పరుగులు చేయడంతో ముంబై జట్టు భారీ స్కోర్ చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ఆవేశ్ ఖాన్ 2, ప్రిన్స్ యాదవ్ 1, దిగ్వేష్ రతి 1, రవి బిష్ణోయ్ 1 వికెట్లు తీశారు. ఇక లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 34, నికోలస్ పూరన్ 27, రిషబ్ పంత్ 4, ఆయూష్ బదోనీ 35, డేవిడ్ మిల్లర్ 24, బిష్ణోయ్ 13, పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ సైతం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఇక ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 10 మ్యాచ్ లు ఆడి.. కేవలం 5 మ్యాచ్ లలోనే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టు లక్నోతో 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో పాయింట్ల టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే రెండో మ్యాచ్ లో విన్నర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే.. ఆ జట్టు నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుంది. దీంతో రెండో స్తానంలో ఉన్న ముంబై మళ్లీ రాత్రి వరకు మూడో స్థానానికి పరిమితం అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ఇలాంటి ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయని అర్థం చేసుకోవచ్చు.
Bishnoi reaction after hitting a six against Bumrah 😭😭😭 pic.twitter.com/9A1Vav4EwT
— ` (@FourOverthrows) April 27, 2025