BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయి అనుకుని ఆంటీతో ఆ పని… ఆ సైకో పిల్ల ఇచ్చే ట్విస్టుకు వణికిపోయే ఫ్యామిలీ

OTT Movie : అమ్మాయి అనుకుని ఆంటీతో ఆ పని… ఆ సైకో పిల్ల ఇచ్చే ట్విస్టుకు వణికిపోయే ఫ్యామిలీ

OTT Movie : ఓటీటీలో ఎన్నో సైకో సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక అమ్మాయి 10 సంవత్సరాల వయసు ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆమెకు ముప్పైకి పైగానే వయసు ఉంటుంది. ఇక ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


రెండు ఓటీటీలలో 

సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘Orphan. 2009లో విడుదలైన ఈ అమెరికన్ మూవీకి జౌమే కొలెట్-సెర్రా దర్శకత్వం వహించారు. ఇందులో వెరా ఫార్మిగా, పీటర్ సార్స్‌గార్డ్, ఇసాబెల్లె ఫుర్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక దత్తత తీసుకున్న ఎస్తర్ అనే బాలిక చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 123 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

కేట్ కోల్మన్, జాన్ కోల్మన్ అనే దంపతులకు, కొనెటికట్‌లో డానియల్, మాక్స్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. కేట్ ఒక మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమెకు గర్భస్రావం అవుతుంది. అందుకు ఈ జంట బాధపడుతుంటారు. ఈ దుఃఖాన్ని అధిగమించడానికి, వీళ్ళు ఒక బాలికను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కేట్, జాన్ స్థానిక అనాథ ఆశ్రమంలో ఎస్తర్ అనే 9 సంవత్సరాల రష్యన్ బాలికను కలుస్తారు. ఎస్తర్ తన ప్రవర్తన, ప్రతిభతో వారిని ఆకట్టుకుంటుంది. ఆమె కళ్ళు, సాంప్రదాయ దుస్తులు ఆమెను ఒక పాతకాలపు బొమ్మలా కనిపించేలా చేస్తాయి. కోల్మన్ దంపతులు ఆమెను దత్తత తీసుకుంటారు. ఆమె వీళ్ళ కుటుంబంలో భాగమవుతుంది. మాక్స్, ఒక చెవిటి బాలిక, ఎస్తర్‌తో త్వరగా స్నేహం చేస్తుంది. కానీ డానియల్ ఆమెను అనుమానిస్తాడు.

ఎస్తర్ ఇంటికి వచ్చిన తర్వాత, వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. ఆమె స్కూల్‌లో ఒక బాలికను బెదిరించి, ఒక స్లైడ్ నుండి పడేస్తుంది. దీనివల్ల ఆ బాలిక గాయపడుతుంది. ఎస్తర్ తన కళ్ళ రంగును దాచడానికి కాంటాక్ట్ లెన్సులు ధరిస్తుందని, ఆమె చేతులు, మెడకు రిబ్బన్‌లు కట్టుకుంటుందని కేట్ గమనిస్తుంది. ఇది ఆమెకు అనుమానాన్ని కలిగిస్తుంది. ఎస్తర్ డానియల్‌ను ఒక ట్రీహౌస్‌లో బెదిరిస్తుంది.అంతే కాకుండా అతని పెంపుడు పక్షిని చంపేస్తుంది. దీనివల్ల డానియల్ ఆమెకు మరింత భయపడతాడు. కేట్ ఎస్తర్ యొక్క ప్రవర్తన గురించి ఆందోళన చెందుతుంది. కానీ జాన్ ఎస్తర్ కి సప్పోర్ట్ గా నిలుస్తాడు. కేట్ గత మద్యపాన సమస్యల వల్ల ఆమె అనుమానాలను తోసిపుచ్చుతాడు. ఇప్పుడు ఎస్తర్ చర్యలు మరింత ప్రమాదకరంగా మారతాయి. ఆమె కేట్, జాన్ సంబంధంలో ఒడిదుడుకులను సృష్టిస్తుంది. జాన్‌తో ఆమె సన్నిహితంగా ప్రవర్తిస్తుంది. ఇది కేట్‌ను మరింత కలవరపరుస్తుంది.

కేట్ ఎస్తర్ కి చెందిన నిజాలు తెలుసుకుంటుంది. ఎస్తర్ నిజానికి 33 సంవత్సరాల వయస్సు గల స్త్రీ. ఆమెకు హైపోపిట్యూటరిజం అనే అరుదైన హార్మోనల్ జబ్బు ఉంటుంది. ఇది ఆమెను చిన్న బాలికలా కనిపించేలా చేస్తుంది. లీనా ఎస్టోనియాలోని సాస్ మానసిక ఆసుపత్రిలో ఉండేది. అక్కడ ఆమె అత్యంత ప్రమాదకరమైన రోగిగా ప్రవర్తించేది. ఆమె గతంలో అనేక కుటుంబాలను దత్తత పేరుతో మోసం చేసి, మగవాళ్లను ఆకర్షించి, వారి కుటుంబాలను నాశనం చేసింది. కేట్ ఈ సమాచారాన్ని జాన్‌కు చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను ఆమెను ఏమాత్రం నమ్మడు. ఇక క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. చివరికి ఎస్తర్ వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి సమస్యలు వస్తాయి ? జాన్ ఆమె ఎలాంటిదో గుర్తిస్తాడా ? కేట్ తనని ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే ..

Read Also : తుడిచి పెట్టేసే సునామీ, బిల్డింగులను మింగేసే భూమి… ఆ ఒక్క ఫ్యామిలీ ఎస్కేప్… రాక్ మామ సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

Big Stories

×