OTT Movies : ఓటిటిలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. అందులో చాలా సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఓటీటీలోకి వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.. ఓటిటి సంస్థలు సినీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఆసక్తికర కంటెంట్ తో ఉన్న సినిమాలను రిలీజ్ కి తీసుకొస్తున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు క్లైమాక్స్ తో ఆకట్టుకున్న కొన్ని సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విరుపాక్ష మూవీ..
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అదిరిపోయే హారర్ సీక్వెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను మన్ననలు పొందిన సినిమా విరూపాక్ష. సినిమాలో అందరిని దెయ్యాలే చంపుతున్నాయని అంతా అనుకుంటారు. కానీ ఆ ఊరి మీద పగతోనే ఒక అమ్మాయి ఇదంత చేస్తుందని తెలుసుకున్న హీరో హీరోయిన్ నుంచి ఊరి జనాలను కాపాడుతారు. క్లైమాక్స్ జనాలను బాగా ఆకట్టుకుంది.. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read :మైండ్ బ్లాక్ చేసే సీన్స్ తో థ్రిల్లర్ మూవీ.. అమ్మాయిలకు మంచి మెసేజ్..
ఆ మూవీ..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డెబ్యూట్ చిత్రం ఆ. వివిధ పాత్రల చుట్టూ సినిమా అంతా సాగుతున్నట్లుగా ఉంటుంది. కానీ, ఆ పాత్రలన్నీ ఒక్క కాజల్ అగర్వాల్ ఆలోచనల నుంచి వచ్చినవని తెలిసే క్లైమాక్స్ ఎవ్వరు ఊహించనివిధంగా ఉంటుంది. ఆ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..
మంగళవారం మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మంగళవారం.. ఈ సినిమాలో అప్పటివరకు అందరిని దెయ్యమో, ఇంకేదో చంపుతుందని అనుకుంటారు. కానీ, ఆర్ఎంపీ డాక్టర్ విశ్వనాథమే చంపుతున్నాడనే క్లైమాక్స్ సీన్ దిమ్మతిరుగుతుంది. అలాగే, రాజేశ్వరి దేవి పాత్రలో వచ్చి ట్విస్ట్ మాత్రం ఎవరు ఏమాత్రం ఊహించి ఉండరు. హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కేరాఫ్ కంచరపాలెం క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ ఇస్తుంది. కేరాఫ్ కంచరపాలెం అంతా మూడు స్టోరీలతో అంథాలజీ చిత్రంగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. కానీ, ఆ స్టోరీలన్నీ రాజు పాత్ర జీవితంలో జరిగినవి అని చూపించే క్లైమాక్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క కూడా క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ సీన్‌లో అది డార్క్ రూమ్ కాదని తెలిసే ట్విస్ట్ మాములుగా ఉండదు.. మూవీ మొత్తానికి అదే హైలెట్ అయ్యింది.
వీటితో పాటుగా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలను మీరు ఒకసారి చూసేయ్యండి.