BigTV English

OTT Movie : మీనా నటించిన దృశ్యం లాంటి ట్విస్ట్ లున్న మూవీ… క్లైమాక్స్ అదుర్స్

OTT Movie : మీనా నటించిన దృశ్యం లాంటి ట్విస్ట్ లున్న మూవీ… క్లైమాక్స్ అదుర్స్

OTT Movie : క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దృశ్యం మూవీ. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్నో సినిమాలు తెరపైకి వచ్చాయి. కానీ దృశ్యం మూవీని మాత్రం మరిపించలేకపోయాయి. ఇక తాజాగా అదే కోవలో రిలీజ్ అయిన మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. పైగా ఇందులో కూడా మీనా హీరోయిన్ కావడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న మలయాళ భాషలోని సినిమానే ఇది కూడా. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? సినిమా పేరేంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ఆరు నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రను పోషించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించగా, జయ రోస్ రాజ్ దర్శకత్వం వహించారు. మార్చ్ 1 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టింది. మనోరమ మ్యాక్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈనెల 27 నుంచి ఓటిటిలో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతోందని టాక్ నడుస్తోంది. ఇక మీనా దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరగా మోహన్ లాల్, పృధ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన బ్రో డాడీ మూవీలో నటించిన విషయం తెలిసిందే.


Anandapuram Diaries (2024) Movie | Flixi

స్టోరీ లోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ నందిని క్యాన్సర్ బారిన పడి కోల్కున్న మహిళ. ఇక పర్సనల్ లైఫ్ పెళ్లి తర్వాత విడాకులతో ముగుస్తుంది. ఈ టెన్షన్స్ అన్నిటి నుంచి బయటపడడానికి తను మధ్యలోనే వదిలేసిన లా డిగ్రీ ని పూర్తి చేయడానికి పూనుకుంటుంది. అలా చదువుకోవడానికి కాలేజీలో చేరుతుంది. ఈ నేపథ్యంలోనే కాలేజీలో నందినికి స్నేహితుడైన ఆదిత్యన్ అనే వ్యక్తి ఓ హత్యలో ఇరుక్కుంటాడు. మాలిని అనే అమ్మాయి డెడ్ బాడీ కాలేజీలో దొరకడంతో పోలీసులు ఆదిత్యన్ నిందితుడనే పేరుతో అరెస్టు చేస్తారు. అంతేకాకుండా అతను కాలేజీలో మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడని ఆరోపణలను కూడా ఎదుర్కొంటాడు. దీంతో సడన్ గా ఆదిత్యన్ కేసును నందిని వాదించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లాయర్ గా వాదించిన తొలి కేసును నందిని గెలిచిందా? డ్రగ్స్ విషయంలో నందిని ఎలాంటి వాస్తవాలను వెలికితీసింది? ఆదిత్యన్ ను ఈ కేసులో ఎవరు ఇరికించారు? అనే విషయాలు తెలియాలంటే ఆనందపురం డైరీస్ అని ఈ సినిమాను చూడాల్సిందే. డైరెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు యువత మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే సోషల్ మెసేజ్ ను తెరపై చూపించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఈ మూవీ యావరేజ్ టాక్ తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×