BigTV English

OTT Movie : చచ్చిన బ్రిటిష్ ప్రేతాత్మలతో యుద్ధం… భయంతో చెమటలు పట్టించే హారర్ మూవీ

OTT Movie : చచ్చిన బ్రిటిష్ ప్రేతాత్మలతో యుద్ధం… భయంతో చెమటలు పట్టించే హారర్ మూవీ

OTT Movie : ఓటిటిలో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ మరే ఇతర జానర్ల సినిమాలకు లేదనే చెప్పాలి. ప్రతి క్షణం భయంకరంగా ఉండడమే కాదు కాకుండా క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మీరు కూడా పక్కా హర్రర్ మూవీ లవర్స్ అయితే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మీకోసమే. వెన్నులో వణుకు పుట్టించేలా ఉండే ఈ హారర్ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


పౌరాణిక కథల స్ఫూర్తితో స్టోరీ

గత కొన్ని ఏళ్ల నుంచి పౌరాణిక కథల స్ఫూర్తితో ఎన్నో సినిమాలు సీరియల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ కూడా ఇలాంటి ప్రేరణ పొందిన స్టోరీనే. దాదాపు నాలుగు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2020లో రిలీజ్ అయింది. హారర్ మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ ను నిర్మించింది. ఈ సిరీస్ లోని నటీనటులు అందరిపై ప్రశంసల వర్షం కురవడంతో పాటు ప్రేక్షకులు, విమర్శలు ప్రశంసలు కూడా అందుకుంది. ఐఎమ్డిబి లో కూడా దీనికి మంచి రేటింగ్ వచ్చింది.


How Well Did Indian Zombie Series Betaal Do

స్టోరీ ఏంటంటే…

గిరిజనులు దేవాలయంలో పూజలు చేయడంతో సిరీస్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది మహిళలు అందులో దయ్యాలతో మాట్లాడతారు. అయితే ఓ మహిళ అక్కడున్న సొరంగాన్ని తెరవకుండా ప్రభుత్వం నిషేధించింది అని చెప్తుంది. మరోవైపు అదే సొరంగం ద్వారా జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ సొరంగాన్ని పగలగొట్టడానికి గ్రామస్తులు అస్సలు ఒప్పుకోరు. దీంతో ప్రభుత్వం ఏకంగా అక్కడికి సైన్యాన్ని పంపి సొరంగాన్ని పగలగొట్టే పనిని మొదలు పెడతారు. పైగా అక్కడికి గ్రామస్తులు ఎవరిని రాకుండా చూసుకుంటారు. ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలైన హారర్ గేమ్. ఆ సొరంగం కొంత వరకు తవ్వాక ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలామంది సైన్యం చనిపోతారు. అందులో నుంచి దయ్యాలైన బ్రిటిష్ సైన్యం బయట పడుతుంది. వాళ్ళ ముఖాలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. క్రూరంగా కనిపించే ఆ దయ్యాల శరీరాలపై కాలిన గుర్తులుంటాయి. కానీ చచ్చిన ఆ ప్రేతాత్మలను చంపడానికి సైన్యం ఏమాత్రం వెనకడదు. దీంతో ఆ దయ్యాలకు నిజమైన, సైన్యానికి మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి చివరికి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? అసలు ఆ సొరంగంలో ఏం జరిగింది? దయ్యాలు ఎందుకు అక్కడ ఉన్నాయి? అనే విషయం తెలియాలంటే భేతాల్ అనే ఈ హారర్ సిరీస్ ని చూడాల్సిందే. కరోనా టైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అప్పట్లో ఆల్మోస్ట్ అందరూ ఈ సిరీస్ ని ఇప్పటికే చూసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ వీకెండ్ మస్ట్ వాచ్.

Tags

Related News

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

OTT Movie : లాటరీ డబ్బుతో అమ్మాయిలతో జల్సా… నరాలు జివ్వుమనే సీన్స్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie: భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

OTT Movie : కుప్పలు తెప్పలుగా మనుషుల శవాలు … థ్రిల్లింగ్ సీన్స్… బోన్ చిల్లింగ్ కన్నడ సై-ఫై థ్రిల్లర్

Big Stories

×