OTT Movie : మిడిల్ క్లాస్ అవసరాలను ఆసరాగా చేసుకుని, ఆడవాళ్లను లొంగదీసుకునే మహానుభావులు ఈ సమాజంలో చాలామంది ఉంటారు. ఇటువంటి సినిమాలు ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తూ ఉంటాయి. మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తో బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
జియో సినిమా (JioCinema)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “బరండ” (Baranda). ఈ మూవీలో ఇద్దరు స్నేహితులు ఒకరికి తెలియకుండా ఒకరు వారి భార్యలను వాడుకోవాలని చూస్తారు. వీళ్ళిద్దరూ వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలతో బాగా కలిసి ఎంజాయ్ చేసేవారు. రొమాంటిక్ కంటెంట్ తో వచ్చిన ఈ రొమాంటిక్ బెంగాలీ మూవీ ‘జియో సినిమా’ (JioCinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
గిరి, మోను అనే అమ్మాయిని చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని ఉంటాడు. గిరి ఇంట్లో బన్వర్ అనే దూరపు చుట్టం పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి వస్తాడు. అయితే వయసు అయిపోయిన గిరి, తన భార్య అందంగా ఉండటంతో బన్వర్ ఇంట్లో ఉండటానికి గిరి మొదట ఒప్పుకోడు. ఆ తర్వాత పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి మోనును బన్వర్ ఒప్పిస్తాడు. గిరి కూడా పనిచేయలేకపోవడంతో అతని ద్వారా కొంత డబ్బు వస్తుందని పేయింగ్ గెస్ట్ గా ఒప్పుకుంటాడు. రోజు రోజుకి మోను అతనితో క్లోజ్ గా ఉండటం గిరి చూస్తాడు. ఈ విషయం తెలిసి బన్వర్ని ఇంటి నుంచి పంపించేస్తాడు. అయితే భార్య మాత్రం ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి, బన్వర్తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఈ విషయం గిరికి కూడా తెలిసి మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు గిరి ఇంటికి మోహన్ అనే ఫ్రెండ్ వస్తాడు. మోహన్, గిరి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాళ్ళు. గిరి భార్య మీద మోహన్ కి ఎప్పటినుంచో కన్ను ఉంటుంది. ఎందుకంటే గిరి భార్య తల్లిని ఒకప్పడు వీరిద్దరూ డబ్బులు ఇచ్చి అనుభవించేవాళ్ళు.
ఆ తర్వాత మోను అందంగా ఉండటంతో గిరి ఆమెను పెళ్లి చేసుకుని ఉంటాడు. మోహన్ కూడా వయసులో ఉన్న ఒక అమ్మాయిని చదివిస్తానని చెప్పి, తనతో పాటు ఉంచుకొని కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. ఒకసారి గిరి మోహన్ తెచ్చుకున్న అమ్మాయిని చూసి తను అందంగా ఉండటంతో, తనతో పరిచయం పెంచుకొని ఏకాంతం గడపాలనుకుంటాడు. ఈ సీన్ కళ్ళారా చూసిన మోహన్ ఆ అమ్మాయిని కొట్టడానికి వస్తే, గిరి రాడ్ తో మోహన్ ని కొట్టి చంపేస్తాడు. చివరికి మోహన్ జీవితం ఏమవుతుంది? మోను తన జీవితాన్ని ఎవరితో పంచుకుంటుంది? మోహన్ తెచ్చుకున్న అమ్మాయి చివరకు ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘జియో సినిమా’ (JioCinema) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “బరండ” (Baranda) అనే రొమాంటిక్ బెంగాల్ మూవీని తప్పకుండా చూడండి.