OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఈ సినిమాలు సౌండ్ ఎఫెక్ట్ తో మంచి థ్రిల్ ఇస్తాయి.రాత్రి పూట ఈ సినిమాలను చూడాలంటే పై ప్రాణాలు పైకే పోతాయి. వెన్నులో వణుకు పుట్టించే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ ఫిలిప్పీన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బార్బేరియన్‘ (Barbarian). ఈ మూవీలో ఒక అమ్మాయి అనుకోకుండా ఆన్లైన్లో ఒక ఇంటిని బుక్ చేసుకుని అందులోకి వెళ్తుంది. అందులో ఆమె ఎదుర్కొనే సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడానికి వెళుతూ ఉంటుంది. అయితే కొంత దూరం వెళ్ళాక వర్షం పడటంతో కారులోనే ఆగిపోతుంది. హీరోయిన్ ఆన్లైన్లో ఒక ఇంటిని బుక్ చేసుకుంటుంది. ఆ ఇంటిదగ్గరికి వెళ్ళగా బయటనుంచి తాళం వేసి ఉంటుంది. కాసేపటి తరువాత లోపలి నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఈ ఇంటిని నాకు కూడా ఆన్లైన్లో ఇచ్చారని చెప్తాడు. అయితే వర్షం పడుతుండటంతో ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళమని ఆమెతో చెప్తాడు అక్కడున్న ఒక మనిషి. వర్షంలో ఉండే కంటే ఇంట్లో ఉండటం బెటర్ అనుకుని ఆ ఇంట్లోకి వెళుతుంది హీరోయిన్. అయితే అందులో ఇంటి కింద మరొక ఇల్లు ఉంటుంది. ఆ వాతావరణం చాలా భయంకరంగా ఉండటంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది హీరోయిన్. అయితే అందులోనే ఉన్న మనిషి ఆమెకు ధైర్యం చెప్తాడు. డైరెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని మళ్ళీ ఆ ఇంటికి వస్తుంది హీరోయిన్. ఈసారి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంటిని చూసి అక్కడికి వెళ్తాడు.
ఒక భయంకరమైన వింత ఆకారం అతనిని చంపేస్తుంది. హీరోయిన్ అతనిని వెతుక్కుంటూ వస్తుంది. ఆమెను కూడా చంప డానికి ట్రై చేస్తుంది ఆ భయంకరమైన ఆకారం. మరోవైపు ఆ ఇంటిని అమ్మడానికి ఓనర్ అక్కడికి వస్తాడు. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే పడి ఉండటంతో, ఆన్లైన్ వాళ్లకి ఫోన్ చేసి మా ఇంటిని ఎవరికి ఇచ్చారు అని అడుగుతాడు. వాళ్లు ఒక అమ్మాయికి ఇచ్చామని చెప్తారు. అయితే ఆ ఇంట్లో ఆ అమ్మాయి బ్యాగ్ తప్ప ఎవరు కనపడరు. చివరికి హీరోయిన్ ఏమవుతుంది? ఆ ఇంట్లో తిరుగుతున్న భయంకరమైన ఆకారం ఎవరిది? ఇంటి ఓనర్ ని ఆ అదృశ్య శక్తి ఏమైనా చేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘బార్బేరియన్’ (Barbarian) అనే హర్రర్ థ్రిల్లర్ మూవీని చూసేయండి.