Zakir Hussein: జాకీర్ హుస్సేన్ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. వావ్ తాజ్ అంటూ ఆయన ఇచ్చిన యాడ్ అందరికి గుర్తుంటుంది. భారతీయ ప్రముఖ తబలా విద్వాంసుడు.. ఈయన తాజాగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు. నిన్న అనారోగ్యం మరింతగా క్షీణించడంతో మృత్యు ఒడిలోకి చేరాడు..
సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ అందజేసింది. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది. అనారోగ్య కారణంగా డిసెంబరు 15, 2024 న అమెరికాలో చికిత్స పొందుతూ మరణించాడు..
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న కన్నుమూశారు. ఈయన తబలా మాంత్రికుడు అల్లారఖా కుమారుడు. సంగీతంలో తండ్రి వారసత్వాన్ని జాకీర్ హుస్సేన్ అందిపుచ్చుకున్నారు. తబలాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేశారు. భారతదేశంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసిద్ధి చెందారు. తన కెరీర్‌లో మొత్తం ఐదు గ్రామీ అవార్డులను పొందారు. అందులో మూడు ఈ ఏడాదిలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో అవార్డును అందుకున్నారు. అలాంటి గొప్ప విద్వాంసుడు ఇక లేరన్న వార్తను చాలా మందికి మింగుడు పడటం లేదు.. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం.. ఇక ఈయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని సమాచారం..