BigTV English

OTT Movie : ఆ దీవిలోకి అమ్మాయిలను తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలిస్తే… వణుకు పుట్టించే థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఆ దీవిలోకి అమ్మాయిలను తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలిస్తే… వణుకు పుట్టించే థ్రిల్లర్ మూవీ

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు చాలామంది ఉంటారు. ఈ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో సస్పెన్స్ చివరిదాకా సాగుతూనే ఉంటుంది. ప్రేక్షకులను కుర్చీలకి అతుక్కునేలా చేస్తాయి ఈ సినిమాలు. ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది? ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime Video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘బ్లింక్ ట్వైస్‘ (blink twice). అమ్మాయిలను ఒక దీవికి తీసుకెళ్లి, ఏకాంతంగా గడిపి వారిని అంతం చేసే ఒక గ్యాంగ్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఫ్రిదా, జెస్సి ఇద్దరు స్నేహితులు, ఒక ప్రముఖ హోటల్లో వైట్రెస్ లుగా పని చేస్తుంటారు. వీళ్ళిద్దరూ ఒక వెకేషన్ కి వెళ్దాం అనుకుంటారు. అయితే ఒక బిలియనీర్ అయిన స్లేటర్ తో అనుకోకుండా ఫ్రిదా, జెస్సి మీట్ అవుతారు. స్లేటర్ తనతో పాటు ఉన్న వ్యక్తులను ఫ్రిదా, జెస్సి కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వీళ్లను ఒక ఐలాండ్ కి ఇన్వైట్ చేస్తాడు. వీళ్లు కూడా వెకేషన్ కి వెళ్లాలనుకోవడంతో వస్తామని చెప్తారు. జెస్సి, ఫ్రిదా ఆ దీవిలో స్లేటర్ ఉన్న చోటికి వెళ్తారు. అయితే అక్కడ వీళ్ళతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు రోజు పార్టీ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇదే దినచర్యగా సాగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఒక స్ప్రే చేసుకోవడంతో, మెదడులో మెమోరీస్ అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి తనతో పాటు వచ్చిన జెస్సి, ఫ్రిదాకి కనపడకుండా పోతుంది. ఆమె ఏమైందో తెలుసుకోవడానికి ఫ్రిదా ప్రయత్నిస్తుంది. సారా అనే ఒక అమ్మాయి తో మాట్లాడుతూ, స్ప్రే చేసుకోవడం వల్ల మెమరీస్ అన్ని డిలీట్ అవుతున్నాయని గ్రహిస్తారు. ఈ అమ్మాయిలను రాత్రిపూట దారుణంగా అబ్బాయిలు అనుభవిస్తూ ఉంటారు.

ఫ్రిదా, జెస్సి ని కూడా చాలామంది అబ్బాయిలు అనుభవిస్తారు. ఆ తర్వాత మైండ్లో మెమరీస్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఆ స్ప్రేని ఫ్రిదా ఒకసారి వాడకపోవడంతో జెస్సిని వాళ్ళు చంపిన విషయం గుర్తుకు వస్తుంది. వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారని భయపడుతూ,అక్కడినుంచి తప్పించుకోవడం కోసం ఎదురుచూస్తుంది. స్లేటర్ గ్యాంగ్ కి అనుమానం రాకుండా వాళ్లతో డాన్స్ వేస్తూ ఉంటుంది ఫ్రిదా. చివరికి ఆ దీవిలో ఈ అమ్మాయిలు ఏమౌతారు? ఫ్రిదా అక్కడినుంచి తప్పించుకుంటుందా? స్లేటర్ ఎంతమంది అమ్మాయిలను ఇలా చేశాడు? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లింక్ ట్వైస్’ (blink twice) అనే రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

Big Stories

×