OTT Movie : థియేటర్లలో వచ్చిన సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే వీటిలో సైకో సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. మొదటి నుండి, చివరిదాకా ఈ సినిమాలు కుర్చీలకు కట్టిపడేస్తాయి. పైకి ఒకలా లోపల మరోలా కనిపించి హత్యలు చేసే, సైకో మూవీలలో ఒక బెస్ట్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘అమెరికన్ సైకో‘ (American psycho). ఈ మూవీలో హీరో పగలు మంచివాడిగా ఉంటూ, రాత్రిపూట రాక్షసుడుగా మారిపోతూ ఉంటాడు. ఈ సైకో థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ప్యాట్రిక్ ఒక కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమెను తొందర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇతనికి రకరకాల అలవాట్లు ఉంటాయి. రాత్రి అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్లి ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ఆ అమ్మాయిలను వేధిస్తూ టార్చర్ కూడా చేస్తూ ఉంటాడు. ప్యాట్రిక్ కు ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు పాల్ అనే వ్యక్తి విజిటింగ్ కార్డ్ చేయించి అందరికీ చూపిస్తాడు. ఇది అందరికన్నా బాగుండటంతో ప్యాట్రిక్ అతనిపై కోపం పెంచుకుంటాడు. అతని ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుంటూ అతనిని చంపేస్తాడు. మరోవైపు అదే రోజు రాత్రి ఇద్దరమ్మాయిలను తీసుకువెళ్లి ఏకాంతంగా గడిపి వాళ్లను కూడా చంపేస్తాడు. పాల్ కనిపించడం లేదని డిటెక్టివ్ ప్యాట్రిక్ దగ్గరికి వస్తాడు. అయితే తనకేం సంబంధం లేదని, చివరిసారిగా పబ్బులో మాత్రమే చూశానని చెప్తాడు. కానీ డిటెక్టివ్ ఇతని మీద అనుమానం పెంచుకుంటాడు. హీరోయిన్ ఒక పందిని పెంచుకుంటూ ఉండటంతో ఆమెపై కూడా అసహ్యం పెంచుకుంటాడు.
ఈ క్రమంలో పిల్లి ఎదురుగా వస్తున్నప్పుడు దానిని కాల్చి చంపేస్తాడు. ఎందుకు చంపావళి పిల్లి యజమాని అతని ప్రశ్నిస్తే, ఆమెను కూడా చంపేస్తాడు. గన్ సౌండ్ రావడంతో అక్కడికి వచ్చిన పోలీసుల కారు పెట్రోల్ ట్యాంక్ ను పేల్చి వాళ్లను కూడా చంపేస్తాడు. చివరికి ఇతను డిటెక్టివ్ నుంచి తప్పించుకోవడానికి ఒక లాయర్ ని కలుస్తాడు. అతనికి పాల్ ని చంపిన విషయం చెప్తాడు. డిటెక్టివ్ హీరోతో దిమ్మతిరిగే విషయాలు కొన్ని చెప్తాడు. హీరో బిక్క మొఖం వేసుకొని ఉండిపోతాడు. అందరి ముందు పగలు మంచివాడిగా రాత్రి రాక్షసంగా నటించే హీరో పరిస్థితి చివరికి ఏమవుతుంది? ఇతను నిజంగానే ఇంతమందిని చంపాడా ? డిటెక్టివ్ హీరోని పట్టుకుంటాడా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న (American psycho) సైకో థ్రిల్లర్ మూవీ తప్పకుండా చూడండి.