OTT Movie : ఈరోజుల్లో డిజిటల్ మీడియా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటి లో మూవీలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు యూత్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి?
రెండు ఓటీటీ లలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “బ్లూ లగూన్ ది అవేకింగ్” (Blue lagoon the awaking). కాలేజ్ చదువుకునే ఇద్దరు విద్యార్థులు పొరపాటున ఒక దీవిలో ఇరుక్కుపోతారు. ఆ దీవి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ లోకి వెళితే తెలుస్తుంది. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఏమ్మా కాలేజ్ లో మంచి క్లవర్ స్టూడెంట్. ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా చదువులో ముందుంటుంది. ఆమె చదువుకునే కాలేజ్ లోనే డీన్ అనే కుర్రాడు కూడా చదువుతూ ఉంటాడు. అయితే ఇతను చదువులో కాస్త వెనుకబడి ఉంటాడు. ఒకరోజు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెకేషన్ కు వెళ్తారు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం రావడంతో చెకింగ్ కి వస్తారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఒక పడవలో పోలీసులనుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు కొంత దూరం పోయాక ఒక దీవి కనబడుతుంది. ఆ దీవిలో నిద్రపోయి లేచి చూసేసరికి వీళ్ళ పడవ మునిగిపోయి ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లడానికి వేరే దారి లేకపోవడంతో వీళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వీరిద్దరూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరు తెచ్చుకున్న వస్తువులు కొన్ని మిస్ అవుతూ ఉండటంతో, ఈ దీవిలో ఎవరో ఉన్నారని వీళ్లు భయపడుతూ ఉంటారు.
అయితే వీరిద్దరూ ఒకే చోట ఉండటంతో ఒకరిని ఒకరు ఇష్టపడి, ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు వీరి తల్లిదండ్రులు వీళ్లను వెతుకుతూ ఉంటారు. నెల రోజులు దాటినా వీరి ఆచూకీ కనబడకపోవడంతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళకు ఆ దీవిలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు ఎదుర్కొన్న ఆ సంఘటనలు ఏమిటి? ఆ దీవి నుంచి వీళ్ళు బయటపడతారా? ఆ దీవిలో వీరి వస్తువులను ఎవరు దొంగలిస్తుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న “బ్లూ లగూన్ ది అవేకింగ్” (Blue lagoon the awaking) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఒక మంచి లవ్ స్టోరీతో తెరకెక్కించారు మేకర్స్. మూవీ లవర్స్ ని ఈ యూత్ ఫుల్ మూవీ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సీన్స్ ఒంట్లో వేడి పుట్టించే విధం గా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం ఈ మూవీపై ఓ లుక్ వేయండి.