Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో అసలు లవ్ కపుల్ ఎవరు అనే ప్రశ్నకు ఆడియన్స్ దగ్గర నుండి సమాధానం లేదు. ముందుగా నిఖిల్, సోనియా మధ్య లవ్ ట్రాక్ మొదలయ్యింది. ఆ తర్వాత సోనియా వెళ్లిపోయింది. సీత కూడా నిఖిల్‌ను ఇష్టపడింది. సీత కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలోకి యష్మీ వచ్చింది. నిఖిల్‌తో మాత్రమే కాకుండా పృథ్వి, గౌతమ్‌లతో కూడా క్లోజ్‌గా ఉంటూ తనకు నచ్చింది జరిగేలా చేసుకుంటుంది యష్మీ. ఇప్పుడు ఆ యష్మీ వేసిన వలలో నిఖిల్ చిక్కుకున్నాడు. గత రెండు వారాలుగా నిఖిల్ నామినేషన్స్ చూస్తుంటే తను ఎంతలా ఆ మాయలో మునిగిపోయాడో అర్థమవుతోంది. ఈవారం అదే రిపీట్ అయ్యింది.
అదే కారణం
ఈవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగానే తనకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అవకాశం ప్రేరణకు వచ్చింది. తను వెంటనే వచ్చి గౌతమ్‌ను నామినేట్ చేసింది. ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుండి గౌతమ్‌తో తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అవే మనసులో పెట్టుకొని గౌతమ్‌పై రివెంజ్ ప్లాన్ చేసింది ప్రేరణ. పైగా మెగా చీఫ్ అనే అధికారం తన చేతిలో ఉండడంతో దానిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటుంది. అలాగే నామినేట్ కూడా చేసింది. ఆ తర్వాత నిఖిల్‌కు తనకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అవకాశం లభించగానే వెంటనే వెళ్లి టేస్టీ తేజను నామినేట్ చేశాడు. గతవారం ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో తేజ చేసిన తప్పును ఎత్తిచూపించాడు.
Also Read: బిగ్ బాస్ 8 నుంచి హరితేజ అవుట్.. రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే..?
అదే రిపీట్
గతవారం జరిగిన ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో తనకు ఆ షీల్డ్ వద్దని నిఖిలే స్వయంగా ఒప్పుకున్నాడు. అలాంటిది తనకే ఆ షీల్డ్ ఇవ్వాలని యష్మీ వాదించింది. దానికి తేజ అడ్డుపడ్డాడు. వారిద్దరికీ గొడవయ్యింది. యష్మీతో తేజ గొడవపడడం నిఖిల్‌కు నచ్చలేదు. అందుకే ఈ నామినేషన్. గతవారంలో కూడా గౌతమ్.. యష్మీతో గొడవపడ్డాడని అదే కారణం చెప్పి తనను నామినేట్ చేశాడు నిఖిల్. ఇప్పుడు తేజ విషయంలో మళ్లీ అదే రిపీట్ అయ్యింది. ఇది చూస్తున్న ఆడియన్స్.. నిఖిల్ అసలు అమ్మాయిలు లేకుండా ఆడలేడా అని ఫీలవుతున్నారు. అదే సమయంలో తేజ వెళ్లి యష్మీని నామినేట్ చేయగానే గొడవ మరింత పెద్దగా అయ్యింది.
రెచ్చిపోయిన యష్మీ
ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో తేజది ఎంత తప్పుందో యష్మీది కూడా అంతే తప్పుంది. అయినా అది యష్మీ ఒప్పుకోలేదు. తేజతో వాగ్వాదానికి దిగి ఓవరాక్షన్ చేసింది. అప్పటికి నిఖిల్ సైలెంట్ అయినా పృథ్వి వచ్చి దమ్ముంటే యష్మీకి ఎవరు సపోర్ట్ చేశారో పేరు చెప్పు అంటూ తనను రెచ్చగొట్టాడు. ఈ విషయం తేజకే కాకుండా చాలామందికి నచ్చలేదు. వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగినప్పుడు నీ పేరు చెప్పాల్సింది అంటూ తేజను అనరాని మాటలు అంది యష్మీ. నామినేషన్స్‌లో యష్మీ వేరే కోణం చూసిన ప్రేక్షకులు మరోసారి తను హౌస్‌లో ఉండడం అనవసరం అని ఫీలవుతున్నారు. కానీ ప్రతీవారం ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ యష్మీ మాత్రం తప్పించుకుంటోంది.