OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో ఎప్పుడు పడితే అప్పుడు నచ్చిన టైంలో నచ్చిన సినిమాలు చూసుకునే వీలుంటుంది. ఈ సినిమాలలో రొమాంటిక్ కంటెంట్ ఉండే స్టోరీలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ కు యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు. అటువంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ ఎంటర్టైన్ మూవీ పేరు ‘క్యారీడ్ అవే‘ (Carried away). ఈ మూవీలో 50 సంవత్సరాల టీచర్ తో ఒక యంగ్ అమ్మాయి సరసాలు ఆడుతూ పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జోసెఫ్ ఒక స్కూల్ టీచర్ గా పని చేస్తుంటాడు. వయసులో ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో కాలు సరిగ్గా పనిచేయకుండా పోతుంది. ఇతను వయసులో ఉన్నప్పుడు రోస్లి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమెకు ఇంకొకరితో పెళ్లి అయిపోతుంది. ఆమె భర్త కూడా ఆర్మీలో చనిపోతాడు. రోస్లి జోసఫ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో జోసెఫ్ పనిచేసే స్కూల్ కి కేథరిన్ అనే అమ్మాయి వస్తుంది. ఆమె జోసెఫ్ తో క్లోజ్ గా ఉంటూ అతని దగ్గర ఉన్న గుర్రంతో స్వారీ చేస్తూ ఉంటుంది. అలాగే అతనితో ఏకాంతంగా గడపటానికి చూస్తుంది. మొదట జోసెఫ్ తప్పు చేస్తున్నానేమో అని బయటకి వస్తాడు. ఈ అవకాశం మళ్లీ రాదేమో అని ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. అలా వీళ్ళ రొమాన్స్ జోసెఫ్ ఫ్రెండ్ కు తెలుస్తుంది. అతను నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తాడు. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ ఆ తప్పు నాకు బాగా నచ్చింది అంటూ బదిలిస్తాడు జోసఫ్.
కొద్ది రోజులకు కేథరిన్ తనని పెళ్లి చేసుకో అని జోసఫ్ ని అడుగుతుంది. మనిద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది అంటూ ఆమెకు సమాధానం చెప్తాడు జోసెఫ్. మరోవైపు రోస్లి కూడా జోసఫ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో కేథరిన్ విషయం రోస్లీకి తెలుస్తుంది. జోసెఫ్ దగ్గరికి వెళ్లి ఇది నిజమా అని అడుగుతే, అందుకు అతను అవునని సమాధానం చెప్తాడు. అక్కడినుంచి బాధతో రోస్లి వెలిపోతుంది. చివరికి జోసఫ్, కేథరిన్ లవ్ స్టోరీ ఎంతవరకు వెళుతుంది? జోసెఫ్ ని రోస్లీ క్షమిస్తుందా? జోసెఫ్ తన జీవితాన్ని ఈ వయసులో ఎవరితో ప్రారంభిస్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్యారీడ్ అవే’ (Carried away) మూవీని చూడాల్సిందే.