OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్, మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కాలేజ్ లో చదువుకునే స్టూడెంట్స్ ప్రేమలో పడుతూ, వాళ్లు చేసే అల్లరితో ఒక సినిమాను చిత్రీకరించారు మేకర్స్. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు “క్లూ లెస్“(Clueless). ఈ మూవీలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ ను వెతకడంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక కాలేజీలో కొత్తగా జాయిన్ అవుతుంది. హీరోయిన్ కు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఆమె ఫ్రెండ్స్ కు బాయ్ ఫ్రెండ్స్ ఉండడంతో తను కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకుంటుంది. ఈ క్రమంలో క్రిస్టియన్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది. హీరోయిన్ కు జోష్ అనే కజిన్ ఉంటాడు. హీరోయిన్ ను కజిన్ కూడా ఇష్టపడతాడు. ఒకరోజు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో పబ్బుకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్తుంది. జోష్ ఆమెకు తోడుగా వెళ్తాడు. ఆరోజు ఆమె పార్టీ ముగించుకొని క్రిస్టియన్ ను తనతోపాటు ఇంటికి తీసుకువస్తుంది. అతనితో ఏకాంతంగా గడపటానికి ట్రై చేస్తుంది. అయితే అతడు ఆమెను ఏమి చేయకుండా వెళ్ళిపోతాడు. అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడు తెలిసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే అతడు ఒక గే. అయితే అతడు గే అని తెలిసినా కూడా అతనితో ఫ్రెండ్ గా ఉంటూ, మరొక బాయ్ ఫ్రెండ్ దొరికితే బాగుండని అనుకుంటుంది. అయితే హీరోయిన్ చదువులో కాస్త వెనకబడుతుంది.
చదువులో సీగ్రేడ్ రావడంతో మార్కులు తండ్రికి చూపించలేకపోతుంది. కాలేజ్ లో ఒక టీచర్ కి ఇంకో టీచర్ ని పరిచయం చేపించి, వాళ్లను లవ్ చేసుకునేలా చేస్తుంది. వాళ్లు అప్పటినుంచి హీరోయిన్ కు మంచి మార్కులు వేయడం మొదలు పెడతారు. ఇది ఇలా ఉంటే హీరోయిన్ లైఫ్ లోకి ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అతనితో పాటు,కజిన్ కూడా ఈమెను ఇష్టపడుతూ ఉంటాడు. చివరికి హీరోయిన్ ఎవరిని లవ్ చేస్తుంది? ఇంతకీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో డేట్ కు వెళ్తుందా? కజిన్ తనని లవ్ చేస్తున్నాడని హీరోయిన్ కి తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “క్లూ లెస్”(Clueless) యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో వేడి పుట్టించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది.