Pregnant Woman safe: మహారాష్ట్రలో ఓ గర్భిణీ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు క్షణంలో తప్పించుకున్నారు. గర్భిణీని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఓ ప్రాంతం నుంచి ప్రెగ్నెంట్ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే అంబులెన్స్ దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే ప్రమాదం చోటు చేసుకుంది.
వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి కొద్దికొద్దిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వాహనాన్ని ఆపి అంబులెన్స్‌లో ప్రెగ్నెంట్ మహిళ, ఆమె బంధువులను దించి కొంతదూరం వెళ్లాలని కోరాడు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
ఆ తర్వాత అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ పేలుడు ధాటికి సమీపంలో ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: ఏటీఎం సెంటర్ కు వచ్చిన వరాహం.. జెట్ స్పీడ్ తో వచ్చి.. తన పని కానిచ్చేసింది.. ఏం జరిగిందంటే?
అంబులెన్స్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో సమీపంలో కొందరు యువకులు దీన్ని షూట్ చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన తర్వాత మరో అంబులెన్స్‌లో ప్రెగ్నెంట్ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్భిణీ, ఆమె కుటుంబం
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘటన
అంబులెన్స్‌లో గర్భిణీని తన కుటుంబం జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ప్రమాదం
పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల… pic.twitter.com/F5q6MM5TMN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024