E-Paper
Advertisement

OTT Movie : 10 రోజుల గ్యాప్ తో ఓటిటిలోకి 3 హారర్ సినిమాలు… ఏ మూవీని ఎక్కడ చూడచ్చు అంటే?

OTT Movie : 10 రోజుల గ్యాప్ తో ఓటిటిలోకి 3 హారర్ సినిమాలు… ఏ మూవీని ఎక్కడ చూడచ్చు అంటే?
Advertisement

OTT Movie : ఓటిటిలో హారర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జానర్ లో వచ్చే సినిమాలకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నయా హారర్ సినిమాలు వస్తాయా ఓటీటీలోకి అని ఓటిటి మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. గత పది రోజుల్లోనే ఓటిల్లోకి ఏకంగా మూడు హర్రర్ సినిమాలు అడుగు పెట్టాయి. అందులో రెండు తమిళ సినిమాలు ఉంటే, ఒకటి బాలీవుడ్ మూవీ. మరి ఈ మూడు సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన స్త్రీ

Advertisement

ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ అయిన హిందీ సీక్వెల్ స్త్రీ 2 సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 60 కోట్ల బడ్జెట్ తో రూపొంది, ఇప్పటిదాకా 850 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.

పేచి

Advertisement

ఇదొక తమిళ హారర్ మూవీ. ‘పేచీ’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఆహా తమిళ్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. బాల శర్వానంద్, గాయత్రి శంకర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ప్రస్తుతం రెండు ఓటిటిలలో స్ట్రిమింగ్ అవుతున్న ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రామచంద్రన్ బి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా మొత్తం తమిళనాడులో ఉన్న కొల్లిమలై హిల్స్ అనే అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వెళ్లే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. అడవిలో ఉండే పేచీ అనే దయ్యాన్ని వీళ్ళు నిద్ర లేపుతారు. ఆ తర్వాత ఈ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ.

డిమోంటి కాలనీ 2

డిమోంటి కాలనీ మూవీకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో చాలా కాలంగా ఈ మూవీ సీక్వెల్ గురించి వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ ఆగస్ట్ 15 నుంచి తమిళంలో థియేటర్లలోకి వచ్చింది. ఆ వారం తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయింది. రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, అరుల్ నిధి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సెప్టెంబర్ 27 నుంచి జీ5 అనే ఓటీటీలో ‘డిమోంటి కాలనీ 2’ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్

పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్

బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

చెస్‌ బోర్డ్‌ మీద ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న పదేళ్ల పిల్లాడి కథ… ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా

ఆసుపత్రిలో దాడి… అదే సమయంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ… గూస్‌బంప్స్ తెప్పించే మలయాళ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×